Monday, July 4, 2022
Home సినిమా వార్తలు

సినిమా వార్తలు

మాస్ మహారాజా రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ థర్డ్ సింగిల్ ‘నా పేరు సీసా’ విడుదల

ప్రోమోతో అలరించిన మాస్ మహారాజా రవితేజ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ 'రామారావు ఆన్ డ్యూటీ' థర్డ్ సింగల్ 'నాపేరు సీసా' పూర్తి పాటని విడుదల చేసింది చిత్ర యూనిట్. అన్వేషి జైన్ సీసా...

నితిన్ ‘మాచర్ల నియోజక వర్గం’ స్పెషల్ సాంగ్ నుండి అంజలి లుక్ విడుదల

యంగ్ అండ్ వెర్సటైల్ హీరో నితిన్ పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ 'మాచర్ల నియోజకవర్గం' లో మరో గ్లామర్ క్వీన్ చేరి మరింత గ్లామరస్ గా మారుతోంది. ఈ చిత్రంలో కృతి శెట్టి,...

సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో హీరో సుమంత్ కొత్త చిత్రం

హీరో సుమంత్ ఓ కొత్త చిత్రానికి అంగీకరించారు. "సుబ్రహ్మణ్యపురం", "లక్ష్య" చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న యంగ్డై రెక్టర్ సంతోష్ జాగర్లపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్...

అమెరికాలో లెజెండరీ బిల్ గేట్స్‌ను కలసిన సూపర్ స్టార్ మహేష్ బాబు

సర్కారు వారి పాట' తో బ్లాక్ బస్టర్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కుటుంబంతో కలిసి విదేశీ విహార యాత్రలో వున్నారు. యూరప్‌ పర్యటన ముగించుకున్న అనంతరం ఇటీవలే అమెరికాకు షిఫ్ట్ అయ్యారు. బుధవారం ఉదయం మహేష్ బాబు దంపతులు లెజెండరీ బిల్ గేట్స్‌ను కలిశారు. బిల్ గేట్స్‌కి పెద్ద అభిమానైన మహేష్ బాబు ఆయన్ని కలసిన సందర్భంలో థ్రిల్ ఫీలయ్యారు. కోట్లాది మంది అభిమానులు మహేష్‌తో ఫోటోలు తీసుకోడానికి ఆరాటపడగా, సూపర్‌స్టార్ ఫ్యాన్‌ బాయ్‌గా మారి మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడితో ఫోటో దిగారు. " బిల్‌గేట్స్‌ గారిని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రపంచం చూసిన గొప్ప దార్శనికులలో ఆయన ఒకరు. నిజమైన స్ఫూర్తి" అని బిల్ గేట్స్‌తో కలిసి దిగిన ఫోటోని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు మహేష్. ఈ ఫోటో లో మహేష్ సతీమణి నమ్రత కూడా వున్నారు.  మహేష్ బాబు తదుపరి చిత్రం #SSMB28 హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో అగ్ర దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కబోతోంది.

ప్రభాస్‌తో మల్టీస్టారర్ చేయడానికి ఎప్పుడైనా సిద్ధమే.. గోపీచంద్ 

వరస విజయాలతో జోరు మీదున్న విలక్షణ దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న సినిమా పక్కా కమర్షియల్. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్ ఫుల్ బ్యాన‌ర్లుగా అంద‌రి మ‌న్న‌న‌లు అందుకున్న జీఏ2...

అక్కినేని అఖిల్, సురేందర్ రెడ్డి, అనిల్ సుంకర  ‘ఏజెంట్’ 

యంగ్ అండ్ డైనమిక్ స్టార్ అక్కినేని అఖిల్ హీరోగా స్టయిలీష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ 'ఏజెంట్. స్టయిలీష్ స్పై థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న 'ఏజెంట్' శరవేగంగా షూటింగ్...

దళపతి విజయ్- వంశీ పైడిపల్లి- దిల్ రాజు- ‘వారసుడు’

దళపతి విజయ్ కధానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్,  పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి...

లావణ్య త్రిపాఠి హ్యాపీ 340

మత్తువదలరా చిత్రంతో ప్రేక్షకుల అభినందనలతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు రితేష్ రానా దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం హ్యాపీ బర్త్‌డే. ప్రముఖ కథానాయిక లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్న...

మాస్ మహారాజా రవితేజ’రామారావు ఆన్ డ్యూటీ’ జూలై 29న విడుదల

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'రామారావు...

రాఘవ లారెన్స్ ‘రుద్రుడు’ ఫస్ట్ లుక్ విడుదల

నటుడు-కొరియోగ్రాఫర్-దర్శకుడు రాఘవ లారెన్స్ ప్రస్తుతం కతిరేసన్ దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కతిరేశన్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి 'రుద్రు'డు అనే టైటిల్‌ను పెట్టారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. పోస్టర్‌లో రాఘవ లారెన్స్ స్టంట్ సీక్వెన్స్‌లో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. పోస్టర్‌ని బట్టి చూస్తే సినిమా యాక్షన్‌లో హైలైట్‌గా వుండబోతుంది. 'ఈవిల్ ఈజ్ నాట్ బోర్న్ , ఇట్ ఈజ్ క్రియేటడ్' అనేది సినిమా ట్యాగ్‌లైన్. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో లారెన్స్ ఈవిల్ లుక్ లో కనిపించడం ఆసక్తినిపెంచింది. శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తోంది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఆర్ డి రాజశేఖర్-ఐఎస్ సి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆంథోనీ ఎడిటర్ గా , శివ-విక్కీ స్టంట్స్ అందిస్తున్నారు. సినిమా తొంభై శాతం షూటింగ్ పూర్తయింది. 'రుద్రుడు' 2022 క్రిస్మస్‌కు థియేటర్లలో విడుదల కానుంది. తారాగణం: రాఘవ లారెన్స్, శరత్ కుమార్, ప్రియా భవానీ శంకర్, పూర్ణిమ భాగ్యరాజ్, నాజర్ తదితరులు