నేను హిందువుగా పుట్టా.., హిందువుగానే చనిపోతా: కేఏ పాల్

క్రైస్తవ మత ప్రచారకుడు కెఎ పాల్,తాను హిందువుగా పుట్టానని,హిందువుగానే చనిపోతానని,అయితే యేసుక్రీస్తు అనుచరుడిని అని వెల్లడించాడు. కొండగట్టు ఆలయ అభివృద్ధికి తెలంగాణ సీఎం కేసీఆర్ రూ.600 కోట్లు ప్రకటించడంపై పాల్ స్పందిస్తూ కుట్ర పన్నిందన్నారు.
ఆలయ అభివృద్ధికి రూ.600 కోట్ల పన్ను చెల్లింపుదారుల సొమ్మును ప్రకటించడం ద్వారా కేసీఆర్‌ పరోక్షంగా ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండాను అమలు చేస్తున్నారని, బీఆర్‌ఎస్‌ అంటే బీజేపీ బీ-టీమ్‌ తప్ప మరొకటి కాదన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన కుమార్తె, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితారావును అరెస్ట్ చేయకుండా కేసీఆర్ వ్యూహాత్మకంగా తప్పించుకున్నారు అని పాల్ అన్నారు.
కొండగట్టు అభివృద్ధికి రూ.600 కోట్లు కేటాయించిన సీఎం కేసీఆర్‌పై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేస్తామని పాల్ తెలిపారు. కేసీఆర్ సెక్యులర్ వ్యక్తి అయితే తెలంగాణలో చర్చిలు, మసీదుల అభివృద్ధికి, పునరుద్ధరణకు నిధులు ఎందుకు ప్రకటించడం లేదు? అని పాల్ ప్రశ్నించారు. రేపు అంటే ఫిబ్రవరి 17న జరగాల్సిన తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవాన్ని కేసీఆర్ ప్రభుత్వం వాయిదా వేయడంతో తెలంగాణలో కలెక్టరేట్ల ముట్టడిని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధినేత ప్రకటించారు.

Previous articleమంత్రి రోజా పై ఘాటుగా స్పందించిన నారా లోకేష్!
Next articleబిజెపిని వీడిన కన్నా.. తర్వాత ఏంటి?