టీడీపీ మళ్లీ పూర్వ వైభవం సంతరించుకుంటుందా?

ఆంధ్రప్రదేశ్‌లో, తెలుగుదేశం బలమైన క్యాడర్ ఉనికి, ప్రజల విశ్వాసంతో దాదాపు 50 అసెంబ్లీ నియోజకవర్గాలను కలిగి ఉంది. అయితే 2019లో వైసీపీ తాకిడిలో ఆ విశ్వాసం దెబ్బతింది. చాలా మంది టీడీపీ నేతలు వైసీపీ అభ్యర్థులకు గట్టి పోటీ ఇచ్చి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. రాజకీయ విశ్లేషకులు ఇప్పుడు ఈ నియోజకవర్గాలు, టీడీపీ గెలుపు అవకాశాలను అంచనా వేస్తున్నారు.
2019లో తెలుగుదేశం ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. దాన్ని క్యాష్ చేసుకున్న వైసీపీ హవా ఎక్కువ‌గా ఉండ‌డంతో మొద‌టిసారి టీడీపీకి చెందిన సీనియ‌ర్ల‌ను ఓడించారు. ఇప్పుడు వాతావరణం మారిపోయింది, ఫ్యాన్ రివర్స్ డైరెక్షన్‌లో కదలాడుతోంది. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేలకు, ఆయా నియోజకవర్గాల ప్రజలకు మధ్య చాలా గ్యాప్ ఉంది. వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజల అంచనాలను అందుకోలేకపోవడమే కారణం. అంతేకాకుండా మెజారిటీ ఎమ్మెల్యేలు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండరు. దీన్ని సద్వినియోగం చేసుకున్న తెలుగుదేశం ప్రజలకు చేరువవుతోంది.
టీడీపీ మళ్లీ బలం పుంజుకోవడంతో ఇదో అద్భుతమైన అవకాశం అంటున్నారు నిపుణులు. ఒంగోలు, విజయవాడ సెంట్రల్, తాడికొండ, వినుకొండ, గురజాల, అరకు, పాడేరు నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి. ఈ నియోజకవర్గాల్లోని స్థానిక ఎమ్మెల్యేలు ప్రజల కోరిక మేరకు పని చేయలేదు. వైసీపీ ఎమ్మెల్యేలతో పోలిస్తే 2014-19 మధ్యకాలంలో చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు సమర్థవంతంగా పనిచేశారనేది సర్వత్రా అభిప్రాయం. అయితే టీడీపీ మళ్లీ పూర్వ వైభవం సంతరించుకోవడం ఆయా నియోజకవర్గాల్లోని పార్టీ అభ్యర్థులపై ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Previous articleమజ్లిస్‌కు బీఆర్‌ఎస్‌ ఆఫర్‌?
Next articleఏపీలో రాజకీయ పార్టీల స్టిక్కర్ వార్ !