ఏపీ ప్రభుత్వ ఉద్యోగులపై ప్రతీకారం మొదలైందా?

ఈ నెల ప్రారంభంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేసింది. ఉద్యోగులకు చెందిన జీపీఎఫ్ ఖాతా నుంచి ఏపీ ప్రభుత్వం రూ.500 కోట్లను విత్‌డ్రా చేసిందని, ఉద్యోగులకు రూ.12,000 కోట్ల విలువైన ఆర్థిక ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా క్లియర్ చేయలేదని ఏపీజీఈఏ తమ ఫిర్యాదులో పేర్కొంది.
ఇక్కడ ఏపీ ప్రభుత్వం నుండి ప్రతిస్పందన వచ్చింది.ఏపీజీఈఏ కి వివరణ కోరుతూ నోటీసులు అందించింది,
రికగ్నిషన్ ఆఫ్ సర్వీస్ అసోసియేషన్ (ROSA) నిబంధనలను ఏపీజీఈఏ ఉల్లంఘించిందని ప్రభుత్వం తన నోటీసులలో పేర్కొంది.ఉద్యోగుల ఆందోళనలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. నిబంధనలు అమలులో ఉన్నప్పుడు, ఏపీజీఈఏ లో భాగంగా గవర్నర్‌ను కలవడం సరికాదు అని నోటీసులలో పేర్కొంది. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే గవర్నర్‌ను కలిసిన తర్వాత మీడియా ముందు చేసిన ఏపీజీఈఏ సభ్యుల ప్రకటనలను ఏపీ ప్రభుత్వం తన నోటీసుల్లో జత చేసింది.
ఏపీ ప్రభుత్వం ఏపీజీఈఏ నోటీసులకు వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని కోరింది, లేనిపక్షంలో ROSA నిబంధనలను ఉల్లంఘించినందుకు తదుపరి చర్య తీసుకుంటుంది. ఏపీజీఈఏ చీఫ్ సూర్యనారాయణ తన మొదటి ప్రతిచర్యలో మా ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్, ప్రత్యేక ఆర్థిక కార్యదర్శి మరియు క్యాబినెట్ సబ్‌కమిటీని అనేకసార్లు కలిశామని, అయితే ఏపీ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదని తెలిపారు. గవర్నర్‌ను కలవడం తప్ప వారికి వేరే మార్గం లేకుండా పోయింది. ప్రభుత్వ నోటీసులపై ఏపీజీఈఏ సభ్యులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని సూర్యనారాయణ బదులిచ్చారు.

Previous articleవివేకా కేసులో కీలక పరిణామం.. వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు!
Next articleకడప వైసీపీ నుంచి టీడీపీలో చేరనున్నరెడ్డిలు !