టీడీపీ శిబిరంలో చేరిన ఐ-ప్యాక్ కీలక సభ్యుడు?

ఎన్నికల సమయంలో లేదా అంతకంటే ముందు రాజకీయ నాయకులు తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఒక పార్టీ నుండి మరొక పార్టీలోకి ఫిరాయించడం మనం తరచుగా వింటూనే ఉంటాం. అయితే ఒక పార్టీ కోసం పనిచేస్తున్న రాజకీయ వ్యూహకర్తలు కూడా ఇప్పుడు ప్రత్యర్థి పార్టీల్లోకి దూకుతున్నారు. నివేదికల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ వ్యూహాలు రచిస్తున్న ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) కీలక సభ్యుడు ఇటీవల ఎన్ చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెలుగుదేశం పార్టీలోకి చేరాడు.
ఇటీవల వరకు ఆంధ్రప్రదేశ్‌లోని ఐ-ప్యాక్ టీమ్‌లో కోర్ మెంబర్‌గా ఉన్న శంతను సింగ్,సంస్థ నుండి వైదొలిగి, రాబిన్ శర్మ నిర్వహిస్తున్న షోటైమ్ కన్సల్టింగ్ (STC)కి మారారు, 2024లో ఆంధ్ర అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు వ్యూహాలు ,పోల్ వర్కౌట్ కోసం టీడీపీ నియమించింది. శంతను సింగ్, IIT-కాన్పూర్ పూర్వ విద్యార్థి,రిషి రాజ్ సింగ్‌కు సన్నిహితుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఐ-ప్యాక్ యొక్క పొలిటికల్ ఇంటెలిజెన్స్ వింగ్‌ను చూస్తున్నాడు.
అతను 2019 ఎన్నికలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోసం పనిచేశాడు,కానీ సింగపూర్‌లోని లీ కువాన్ యూ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీలో మాస్టర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేయడానికి ఐ-ప్యాక్ నుండి విరామం తీసుకున్నాడు.అతను సింగపూర్ నుండి తిరిగి వచ్చిన తర్వాత, అతను ఐ-ప్యాక్ లో తిరిగి చేరాడు. రెండు నెలల క్రితం వరకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిని నిర్వహించడంలో బిజీగా ఉన్నాడు. కానీ కొన్నికారణాల వల్ల, అతను ఐ-ప్యాక్ నుండి రాజీనామా చేసి, రాబిన్ శర్మ బృందంలో “డైరెక్టర్” స్థాయి హోదాలో చేరాడు. వైఎస్‌ఆర్‌సి ప్రచార ప్రణాళిక లోపల, వెలుపల ఆయనకు తెలుసు కాబట్టి, ప్రయోజనం పొందడానికి టిడిపి అతన్ని నియమించుకున్నట్లు వర్గాలు తెలిపాయి.

Previous articleకవితకు అన్ని తలుపులు మూసుకున్నాయా?
Next articleఏపీలో కాపులకు త్వరలో 5 శాతం కోటా!