స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాల నాటికి బలమైన శక్తిగా భారత్ ఎదుగుతుంది: టీడీపీ అధినేత చంద్రబాబు

ఐఎస్‌బీ ఆవిర్భావ ముగింపు వేడుకలలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగం : ఇవాళ ఎంతో ఆనందకరమైన రోజు – మహతీర్ మహమ్మద్ విజన్ 2020 గురించి చెప్పారు – ప్రమత్ రాజ్ సహాయం తీసుకోమని మహతీర్ చెప్పారు – మహతీర్ మహమ్మద్ సలహా మేరకు విజన్ 2020 రూపొందించాం – విజన్ 2020 అన్నప్పుడు కొందరు 420 అని ఎగతాళి చేశారు – విజన్ 2020 కల నేడు సాకారమైంది – విజన్ 2020 తో ప్రారంభించిన వ్యవస్థలు ఇప్పుడు ఉజ్వలంగా ఉన్నాయి – 11 ఏళ్ల క్రితం నాటిన చెట్టులా ఐఎస్ బీ కూడా వృద్ధి చెందింది – భారతీయులు స్వతహాగా గణితంలో ప్రతిభావంతులు – ఆంగ్లేయులు మనకు ఇంగ్లీష్ ను వదిలి వెళ్లారు – గణితం, ఇంగ్లీష్ కలిస్తేనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.. ఇదే విషయం బిల్ గేట్స్ కు చెప్పా – ఒక్క మైక్రోసాఫ్ట్ తీసుకొస్తే దానివెనుక అనేక సంస్థలు వస్తాయని అప్పటి ఆలోచన – అమెరికా వెళ్లి అనేకమంది అగ్రశ్రేణి ఐటీ కంపెనీల సీఈవోలను కలిశాం – మైక్రోసాఫ్ట్ వచ్చాక హైదరాబాద్ లో ఐటీ విప్లవం ఊపందుకుంది – హైదరాబాద్ కు మైక్రో సాఫ్ట్ రావడమే కాదు.. మైక్రోసాఫ్ట్ కు హైదరాబాద్ సీఈవోను ఇచ్చింది – మైక్రోసాఫ్ట్ వచ్చాక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ను అభివృద్ధి చేశాం – ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో అనేక జాతీయ అంతర్జాతీయ సంస్థలు నెలకొన్నాయి – నవ్యాంధ్రప్రదేశ్ లో మేం తెచ్చిన సంస్కరణలతో వరుసగా ఐదేళ్లు 10.80 వృద్ధిరేటు సాధించాం – ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వృద్ధిరేటు 3 శాతానికి ఇటుఇటుగా ఉంది – విధాన నిర్ణయాల కొనసాగింపు అనేది నిరంతర అభివృద్ధికి అవసరం – రాష్ట్ర విభజన తరువాత విజన్ 2029 ని రూపొందించాం – వాతావరణం, అవసరమైన భూ లభ్యత.. హైదరాబాద్ కు అనుకూలం – ఏపీకి పొడవైన సముద్ర తీరం సానుకూలం.. ఓడరేవులు అనుకూలం – అప్పటి ప్రధాని వాజ్ పేయి తో పోట్లాడి టెలికామ్ సంస్కరణలకు నాంది పలికాం – ప్రభుత్వ విధాన నిర్ణయాలు, పెట్టుబడుల సమ్మిళితం వల్లే అభివృద్ధి సాధ్యమైంది – జనాభా సమస్య గురించి కూడా మనం ఆలోచించాలి – ఇప్పుడు అందరూ చిన్న కుటుంబం గురించే ఆలోచిస్తున్నారు – ప్రపంచ ఆహార పాత్రగా భారత్ మారాలి – సేవల రంగంలో భారత్ ప్రపంచంలోనే ఉన్నతస్థాయికి ఎదగాలి – సాంకేతికతలో మనవాళ్లు ఎంతో రాణిస్తున్నారు – ఉద్యోగం చేసి సంతృప్తి చెందవద్దని చెప్పా.. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని కోరా – అమెరికా ఐటీ ఉద్యోగాల్లో ఎంతోమంది తెలుగువారు ఉన్నారు – జీఎఫ్ఎస్ టీ విధానం వల్ల ఎంతోమంది పారిశ్రామికవేత్తలు అయ్యారు – జీఎఫ్ఎస్ టీ విధానంలో ఎకో సిస్టమ్ ను బాగా ప్రోత్సహించాను – ఏపీలోని నీటి వనరులతో ప్రతి ఎకరానికి నీరు అందించే అవకాశం – ఏపీ ప్రజలు పారిశ్రామిక అనుకూల మనస్తత్వం కలవారు – హైదరాబాద్ ను మించిన నగరంగా అమరావతిని తయారు చేయాలనుకున్నా – హైదరాబాద్ అనేది విస్తరణతో అభివృద్ధి చెందింది – పూర్తిగా కొత్త నగరం కావడం అమరావతికి మరింత అనుకూలత – కార్పొరేట్లు, ప్రభుత్వ విధానాల్లో నాయకుల వల్ల ముందడుగు పడుతుంది – 2047 నాటికి భారతీయులు అధిక తలసరి ఆదాయం ఉన్నవారిగా ఎదుగుతారు – ప్రపంచంలో ఎక్కువ ఉద్యోగాలు సృష్టించేవారిలో భారతీయులు ముందుంటారు – 2047 నాటికి 1,2,3 స్థానాల్లో భారత ఆర్థిక వ్యవస్థ ఉంటుంది.

Previous articleజాతీయ మీడియా నుండి ప్రత్యేక కవరేజీని పొందడంలో బీఆర్‌ఎస్ విఫలమైందా?
Next articleఏపీ ప్రభుత్వ పథకాలపై వైఎస్ షర్మిల భర్త వ్యాఖ్యలు!