బీజేపీని గౌరవిస్తాం.. ఊడిగం చేయలేం: పవన్

బీజేపీతో పొత్తుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో అలయెన్స్ ఉన్నప్పటికీ.. ఎక్కడో సరిగా లేదనే భావన కనపడుతోందని… ఆ విషయం తమకు తెలుసు, బీజేపీ నాయకత్వానికి కూడా తెలుసని ఆయన అన్నారు.
బీజేపీతో కలిసి వెళ్లడానికే రోడ్ మ్యాప్ అడిగానని… వారు మ్యాప్ ఇవ్వక పోవడం వల్ల తనకు సమయం గడిచిపోతుందని చెప్పారు.

తనకు పదవుల మీద వ్యామోహం లేదని… అయితే రౌడీలు రాజ్యాలు ఏలుతుంటే, గూండాలు గదమాయిస్తుంటే… ప్రజలను కాపాడుకోవడానికి తన వ్యూహాలను మార్చుకోవాల్సి వస్తుందని అన్నారు
ప్రధాని మోదీకి కానీ, బీజేపీకి కానీ తాను వ్యతిరేకం కాదని చెప్పారు. బీజేపీని ఎప్పుడూ గౌరవిస్తామని… అలాగని ఊడిగం చేయలేమని చెప్పారు.

Previous articleఅప్పుడు అసెంబ్లీలో నవ్వారు.. ఇప్పుడు ఏమైందో చూశారుగా…
Next articleAnanya Raj