అప్పుడు అసెంబ్లీలో నవ్వారు.. ఇప్పుడు ఏమైందో చూశారుగా…

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక పంచాయతీ నిధులను దారి మళ్లించి సర్పంచుల అధికారాలకు కత్తెర వేసిందన్నారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. సర్పంచులు ఈ విషయంలో ఆందోళన దిగితే భేషరతుగా మద్దతు తెలియజేస్తానని స్పష్టం చేశారు. వారు ఎలాగో అభివృద్ధి చేయరు సర్పంచులకు అభివృద్ధి చేసే అవకాశం లేదని సెటైర్లు పేల్చారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగడం, హత్యా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

టీడీపీ ప్రభుత్వం హయాంలో దోమలపై దండయాత్ర చేపడితే అసెంబ్లీలో హాస్యాస్పదంగా మాట్లాడారన్నారు. ఇప్పుడు అదే దోమల వల్ల రాష్ట్రవ్యాప్తంగా విష జ్వరాలు వందలాదిమంది మృత్యువాత పడ్డారన్నారు ఎమ్మెల్యే. వరద ముంపు బాధిత ప్రాంతాల్లో ప్రజారోగ్యం దెబ్బ తినకుండా వారికి వైద్య సదుపాయాలు కల్పించడంతోపాటు మందులన్నీ ఉచితంగా అందజేస్తామన్నారు. వరదల వల్ల సంభవించిన నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోతే టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు

Previous articleఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం!
Next articleబీజేపీని గౌరవిస్తాం.. ఊడిగం చేయలేం: పవన్