ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం!

ఆంద్రప్రదేశ్‌ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో మంగళవారం (ఈ రోజు) మధ్యాహ్నం వీరిరువురూ భేటీ అయ్యారు. ఏపీలో రాజకీయ ముఖచిత్రం మారుతోందంటూ మంగళగిరి సభలో వ్యాఖ్యలు చేసిన కాసేపటికే పవన్ కళ్యాణ్.. చంద్రబాబు నాయుడు భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొంత కాలంగా బీజేపీతో సన్నిహితంగా ఉన్న పవన్ కళ్యాణ్.. ఆ పార్టీతో తెగతెంపులు చేసుకొని టీడీపీకి దగ్గరవుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ దిశగా ఈ భేటీలో ఇరువురు నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్‌తో పాటు నాగబాబు, నాదెండ్ల మనోహర్‌ను చంద్రబాబు నాయుడు ఆప్యాయంగా పలుకరించారు. పవన్ కళ్యాణ్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చారు. అనంతరం ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.

విశాఖ పర్యటన నుంచి తిరిగొచ్చిన పవన్ కళ్యాణ్.. మంగళవారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రసంగించారు. వైఎస్సార్‌సీపీపై ఘాటు వ్యాఖ్యలు చేసారు.

Previous articleనేచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘దసరా’
Next articleఅప్పుడు అసెంబ్లీలో నవ్వారు.. ఇప్పుడు ఏమైందో చూశారుగా…