ఢిల్లీలో కేసీఆర్ జాతీయ పార్టీ కార్యాలయం!

కేసీఆర్ జాతీయ పార్టీ స్థాపనపై గతంలోనూ పలు ప్రకటనలు చేసినా.. ఈసారి అది నిజమేనని తెలుస్తోంది. ఆయన ఇప్పటికే ఆవిర్భవించబోయే జాతీయ పార్టీకి ప్రత్యేక పార్టీ కార్యాలయం కోసం అన్వేషణలో ఉన్నారు. ఇందుకోసం ఢిల్లీలో ఓ ప్రైవేట్ భవనాన్ని ఖరారు చేసినట్లు సమాచారం.
సెంట్రల్ ఢిల్లీ ప్రాంతంలో ఉండే ఈ కార్యాలయం నివాసం కమ్-పార్టీ కార్యాలయం అవుతుంది. కొంతమంది పార్టీ ముఖ్య కార్యకర్తలు తమ వ్యక్తిగత మరియు పార్టీ ఉపయోగం కోసం దీనిని ఉపయోగించుకుంటారు. వసంత్‌విహార్‌ మెట్రో రైల్వేస్టేషన్‌ ఎదురుగా నిర్మాణంలో ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీ భవనాన్ని సిద్ధం చేసే వరకు ఇదే పార్టీ జాతీయ కార్యాలయంగా పని చేస్తుంది.
ప్రస్తుతం పార్టీ అధిష్టానం అద్దె ఒప్పందాన్ని కుదుర్చుకుందని, విజయ దశమి రోజున భవనాన్ని ప్రారంభించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చేబుతున్నాయి. మరోవైపు టీఆర్‌ఎస్ ఎంపీ ఒకరు ఢిల్లీలో మకాం వేసి సన్నాహాలను పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. చాలా ముఖ్యమైన సమావేశాలు, ఇతర కార్యకలాపాలు ఇప్పుడు ప్రతిపాదిత అద్దె ప్రాంగణంలో జరుగుతాయి.
కాగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ఉన్న కార్యాలయానికి భిన్నంగా ఈ ఏర్పాటు ఉంటుందని టీఆర్‌ఎస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వంలో జాతీయ స్థాయికి ముఖ్యమంత్రి పీఆర్వో ఉన్నారు. కానీ, ఇది కొత్త పార్టీతో సంబంధం లేకుండా పని చేస్తుంది.

Previous articleకోమటిరెడ్డికి ఎదురుదెబ్బ ! టీఆర్‌ఎస్‌లో చెరిన బీజేపీ కీలక నేతలు!
Next articleవైఎస్ జగన్ పై కొడాలి నాని అసంతృప్తిగా ఉన్నారా?