మహేశ్ బాబు తల్లి ఇందిరాదేవి కన్నుకన్నుమూత.. ప్రముఖులు నివాళులు

సూపర్ స్టార్ కృష్ణ, మహేశ్ బాబు కుటుంబంలో మరో విషాదం నెలకొంది. ఈ తెల్లవారుజామున మహేశ్ బాబు తల్లి ఇందిరాదేవి కన్నుమూశారు. తాజాగా ఇందిరాదేవి కూడా మృతి చెందడంతో ఆ కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. మరోవైపు ఆమె మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు.  

ప్రముఖ నటులు కృష్ణగారి సతీమణి, మహేశ్ బాబుగారి మాతృమూర్తి ఇందిరాదేవి మరణవార్త దిగ్భ్రాంతిని కలిగించిందని చంద్రబాబు అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ బాధ నుంచి త్వరగా కోలుకునే మానసికశక్తిని కుటుంబసభ్యులకు అందించాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని… ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు. 

ఇంకోవైపు మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ… శ్రీమతి ఇందిరాదేవిగారు స్వర్గస్తులయ్యారు అనే వార్త ఎంతో కలచివేసిందని అన్నారు. ఆ మాతృదేవత ఆత్మకు శాంతి చేకూరాలని… సూపర్ స్టార్ కృష్ణగారికి, సోదరుడు మహేశ్ బాబుకి, కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.

Previous articleటీఆర్‌ఎస్‌తో పీకే తెగతెంపులు చేసుకున్నారా?
Next articleMalavika Sharma Glamour Stills