ప్రభుత్వ పాఠశాలను డబుల్ బెడ్రూం ఇళ్లుగా మార్చిన వైసీపీ నేత!

నంద్యాల జిల్లాలో వైసీపీ నేతలు తమ అదికారాన్ని ఉపయోగించుకుని పాఠశాలను డబుల్ బెడ్‌రూం ఇళ్లుగా మార్చేశారు. ఈ సంఘటన పాణ్యం మండలంలో జరిగింది. పాఠశాల గత టిడిపి ప్రభుత్వమే నిర్మించిందని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక నివేదించింది. ఈ మార్పిడి గురించి తెలుసుకున్న నంద్యాల స్థానిక టీడీపీ నాయకులు పాఠశాలను సందర్శించి వైఎస్సార్‌సీపీ నాయకులు వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌ మద్దతుతో బ్లాక్ బోర్డులు, పునాది, ప్రారంభోత్సవ శిలాఫలకాలు తొలగించి పాఠశాలను తమ సొంత ఇల్లుగా మార్చుకున్నారని ఆరోపించారు.
ఈ విషయాన్ని టీడీపీ నేతలు విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆరోపణల ఆధారంగా ఉప జిల్లా విద్యాశాఖాధికారి ఎం.అనురాధ పాఠశాలను తనిఖీ చేసి భవనాన్ని సీజ్ చేసి తాళాలను పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి అందజేశారు. ఈ భవనాన్ని గత ప్రభుత్వం రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షలతో నిర్మించిందని టీడీపీ నంద్యాల నేత జీ వెంకట్ రెడ్డి మీడియాకు తెలిపారు. గత ఐదేళ్లుగా విద్యార్థులు పాఠశాలకు రావడం మానేయడంతో పాఠశాల మూతపడింది.
విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ గొప్పలు చెప్పుకుంటున్నారని, అయితే విడ్డూరం ఏంటంటే.. అధికార పార్టీ నేతలకు పాఠశాలను డబుల్ బెడ్‌రూం ఇళ్లుగా మార్చారని టీడీపీ అంటోంది.

Previous articleచంద్రబాబు, జగన్‌లను కేసీఆర్ ఎందుకు కలవడం లేదు?
Next articleఅంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు పోటీపడుతున్న ఏపీ, తెలంగాణ!