మంగళగిరి నుంచి సత్తెనపల్లికి ఆళ్ల ?

వైఎస్సార్‌సీపీ అగ్రనాయకత్వం స్థానిక పరిస్థితుల దృష్ట్యా అభ్యర్థులను మార్చాల్సిన సీట్లను గుర్తించేందుకు కసరత్తు ప్రారంభించింది. పార్టీలోని కీలక నేతలకు ప్రత్యామ్నాయ సీట్లను కూడా వెతికే ప్రయత్నం చేస్తోంది. అమరావతికి దగ్గరగా ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలు స్థానాల్లో ఈ షఫ్లింగ్ జరగవచ్చు.
ఇప్పటికే తాటికొండ అసెంబ్లీ నియోజకవర్గానికి మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను ఇంచార్జిగా నియమించింది.సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీదేవికి 2024లో పార్టీ టిక్కెట్ ఇవ్వకపోవచ్చనే దానికి ఇది స్పష్టమైన సూచనగా భావిస్తున్నారు. డొక్కా ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆయనను ఇంచార్జ్‌గా చేయడం ద్వారా శ్రీదేవి టిక్కెట్ ఇవ్వకపోవచ్చని అంటున్నారు.
ఇప్పుడు మంత్రి అంబటి రాంబాబును గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి కృష్ణా జిల్లా అవనిగడ్డకు మారాలని కోరవచ్చని సమాచారం. అంబటి అసంతృప్తిగా ఉన్నప్పటికీ, లైన్‌లో పడి అవనిగడ్డకు వెళ్లవలసి ఉంటుంది,అదే విధంగా వైఎస్ జగన్ విధేయుడు ఆళ్ల రామకృష్ణారెడ్డిని అతని స్థానంలో సత్తెనపల్లికి మార్చాలని కోరే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, మంగళగిరి నియోజకవర్గంలో బీసీ సామాజికవర్గానికి చెందిన కొత్త అభ్యర్థికే టికెట్ ఇవ్వనున్నారు.
కాగా, మంగళగిరి సీటు కోసం పలువురు బీసీ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఎమ్మెల్సీ హనుమంతరావు, చిల్లపల్లి మోహన్‌రావు, కాండ్రు కమల రేసులో ఉన్నారు. ఇటీవలే టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరిన గంజి చిరంజీవి మంగళగిరి నుంచి పోటీ చేసేందుకు ఆ పార్టీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయంపై ఆ పార్టీ టికెట్ ఎవరికి దక్కుతుందనేది ఆధారపడి ఉంది.

Previous articleSahar krishnan
Next articleకేసీఆర్ హీరో అన్న వైసీపీ ఎమ్మెల్యే!