ఏపీలో కాకుండా తెలంగాణలో రాహుల్ పాదయాత్ర!

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ “భారత్ జోడో” పేరుతో అక్టోబర్ 2 నుండి ప్రారంభించే పాదయాత్ర తెలంగాణ మీదుగా సాగుతుంది, ఇక్కడ పార్టీ అధికారంలోకి రావాలని ఆశిస్తున్నది; కానీ ఆంధ్ర ప్రదేశ్‌లో మాత్రం ఎటువంటి ఆశలు లేవు.భారత్ జోడో యాత్ర 148 రోజుల పాటు సాగుతుంది, ఇది కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేపట్టబడుతుంది.
ప్రతిరోజు రాహుల్ 25 కి.మీ పాదయాత్ర చేయనున్నారు. ఈపాదయాత్రలో, ర్యాలీలు, బహిరంగ సభలు ఉంటాయి, ఇందులో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో సహా కాంగ్రెస్ అగ్రనేతలు పాల్గొంటారు. ఈ యాత్ర కర్ణాటక-తెలంగాణ సరిహద్దులోని మక్తల్‌లో తెలంగాణలోకి ప్రవేశిస్తుందని, నిజామాబాద్ జిల్లా జుక్కల్ మీదుగా మహారాష్ట్రలోని నాందేడ్‌లోకి ప్రవేశించే ముందు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల గుండా యాత్ర సాగుతుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. యాత్రకు టీపీసీసీ అన్ని ఏర్పాట్లు చేసి బ్రహ్మాండంగా విజయవంతం చేస్తుందని రేవంత్ అన్నారు. మేము యాత్రలో పార్టీ, అన్ని అనుబంధ సంస్థల ప్రజాప్రతినిధులందరూ పాల్గొంటారు అని ఆయన చెప్పారు.
బిజెపి విభజన రాజకీయాలను వ్యతిరేకిస్తూనే, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను కూడా ఈ యాత్ర బట్టబయలు చేస్తుందని అన్నారు. సమయాభావం వల్లో లేక ఆసక్తి లేకపోవడం రాహుల్ గాంధీ పర్యటనలో ఆంధ్రప్రదేశ్‌ను పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ, ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ అంత బలంగా లేదని, అందుకే భారత్ జోడో ప్రచారానికి అక్కడ ఎలాంటి సంబంధం లేదని రాహుల్ కూడా భావించి ఉండవచ్చు.

Previous articleకేసీఆర్ జాతీయ ప్రణాళికలను వేగవంతం.. మమత, కేజ్రీలతో చర్చలు!
Next articleకృష్ణా జిల్లా టీడీపీలో గందరగోళం?