110 ఏళ్లలో యూపీ శాసన మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ లేకపోవడం ఇదే తొలిసారి!

స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారిగా ఉత్తరప్రదేశ్ శాసన మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఎవరూ ఉండరు. ఒకే ఒక్క సిట్టింగ్ ఎమ్మెల్సీ దీపక్ సింగ్ పదవీకాలం ముగిసింది. దీంతో యూపీ కౌన్సిల్‌లో కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం లేదు. కాంగ్రెస్‌కు కేవలం రెండు ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే ఉన్నాయి, రాబోయే ఐదేళ్లలో కాంగ్రెస్ నుండి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే అవకాశం లేదు.
110 ఏళ్లలో యూపీ శాసన మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ లేకపోవడం ఇదే తొలిసారి.కౌన్సిల్ బ్రిటీష్ కాలంలో 1887లో ఏర్పడింది.కాంగ్రెస్ నాయకుడు,జవహర్ లాల్ నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ కౌన్సిల్‌కు నామినేట్ చేయబడిన మొదటి వ్యక్తి. అప్పటి నుంచి ఇన్నాళ్లూ పార్టీకి కొంత ప్రాతినిథ్యం వచ్చింది. దేశంలో కాంగ్రెస్ పార్టీ పడిపోతున్న గ్రాఫ్‌కు ఈ ఘటన అద్దం పడుతోంది. ఉత్తరప్రదేశ్‌లో ఆ పార్టీ క్రమంగా పతనమైపోతోంది.
1989లో కాంగ్రెస్ చివరి ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్. ఆయన తర్వాత యూపీలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయింది.ఈసారి ఆ పార్టీ సమాజ్‌వాదీ పార్టీతో గానీ, బీఎస్పీతో గానీ పొత్తు కూడా పెట్టుకోలేకపోయింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 403 స్థానాల్లో పోటీ చేసినా కేవలం రెండు సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. కాంగ్రెస్ చరిష్మా వల్ల కాకుండా స్థానిక రాజకుటుంబం నుంచి వచ్చిన అభ్యర్థుల వల్ల రెండు స్థానాలను గెలుచుకుంది. దీంతో ఉత్తరప్రదేశ్‌లో ఆ పార్టీ అంతిమంగా పతనమైందని తెలుస్తోంది.

Previous articleడబ్ల్యుబి రుణాన్ని పొందే లక్ష్యంతో పాఠశాలల విలీన చర్య: పట్టాభి
Next articleఈటలను కలిసే వారిపై నిఘా?