సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో హీరో సుమంత్ కొత్త చిత్రం

హీరో సుమంత్ ఓ కొత్త చిత్రానికి అంగీకరించారు. “సుబ్రహ్మణ్యపురం”, “లక్ష్య” చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న యంగ్డై రెక్టర్ సంతోష్ జాగర్లపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో గతంలో విడుదలైన “సుబ్రహ్మణ్యపురం” సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని కేఆర్ క్రియేషన్స్ పతాకంపై కే ప్రదీప్ నిర్మిస్తున్నారు. హిట్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాను ఆదివారం ప్రకటించారు.

పురాతన దేవాలయం నేపథ్యంతో సాగే కథతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఆద్యంతం ఆసక్తికరమైన, థ్రిల్ కు  గురిచేసే అంశాలతో సినిమాను రూపొందించబోతున్నారు
దర్శకుడు సంతోష్ జాగర్లపూడి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉన్న ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు మరికొద్ది రోజుల్లో వెల్లడిస్తామని చిత్ర నిర్మాత కే ప్రదీప్ తెలిపారు.

Previous articleవార్తాపత్రిక కొనడానికి వాలంటీర్లకు ప్రతి నెల రూ. 5 కోట్లు!
Next articleనితిన్ ‘మాచర్ల నియోజక వర్గం’ స్పెషల్ సాంగ్ నుండి అంజలి లుక్ విడుదల