2019లో వైఎస్సార్‌సీపీ 25 ఎంపీ సీట్లకు గాను 22 సీట్లను గెలుచుకున్నప్పటికీ, ఒక ఎంపీ తప్ప అందరూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విధేయులుగా ఉన్నప్పటికీ, కనీసం పది మంది సిట్టింగ్ ఎంపీల పనితీరు పట్ల పార్టీ అధినేత సంతోషంగా లేరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కారణం? ఈ ఎంపీలు, వైఎస్ జగన్ కి,పార్టీకి విధేయులుగా ఉన్నప్పటికీ, వారి వారి నియోజకవర్గాల్లో చాలా చురుకుగా లేరని, పార్టీ నియమించిన అంతర్గత నివేదికలు ఈ 10 మంది ఎంపీలు తమ ప్రాంతాల్లో గత మూడేళ్లలో నియోజకవర్గానికి చేసిందేమీ లేదని ఆరోపించారు.
బాపట్ల ఎంపీ నందిగం సురేశ్, కాకినాడ ఎంపీ వంగగీత ,వైజాగ్ ఎంపీ సత్యనారాయణ, అరకు ఎంపీ జి మాధవి, హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప రెడ్ జోన్‌లో ఉన్నారని ఉన్నతస్థాయి వర్గాలు చెబుతున్నాయి.
ఈ ఎంపీలంతా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేరని సంబంధిత వర్గాలు తెలిపాయి.వీరిలో కొందరు పొరుగు నియోజకవర్గాల వ్యవహారాల్లో వేలు పెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.గత మూడేళ్లలో ఈ ఎంపీలు నియోజకవర్గాల సందర్శించటం, ప్రజలను పట్టించుకోవడం లేదని అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల జరిగిన గడప గడపకూ కార్యక్రమంలో కూడా ఈ ఎంపీలు తమ నియోజకవర్గాల్లో కనిపించలేదు. మూలాలను బట్టి చూస్తే 2024 ఎన్నికల్లో ఈ ఎంపీలను భర్తీ చేయాలని వైఎస్ జగన్ చురుగ్గా ఆలోచిస్తున్నారట