ఈ ఉదయం దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు స్వల్ప గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు అపోలో ఆస్పత్రికి తరలించారు. అతడి గుండెకు స్టెంట్ వేశారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఉదయం వాకింగ్ చేస్తూ టెన్నిస్ ఆడుతున్న సమయంలో ఆయనకు స్వల్ప పక్షవాతం వచ్చినట్లు వినికిడి.దగ్గుబాటి వెంకటేశ్వరరావును టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆస్పత్రిలో పరామర్శించి ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు.అపోలో వైద్యులతో కూడా టీడీపీ అధినేత మాట్లాడారు.
చంద్రబాబు పర్యటనలోని చిత్రాలలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆసుపత్రి బెడ్‌పై ఆయన పక్కనే పురంధేశ్వరి కూర్చున్నారు.దగ్గుబాటి,పురంధేవారితో చంద్రబాబు కొద్దిసేపు మాట్లాడినట్లు సమాచారం.
ఈ పర్యటన పూర్తిగా రాజకీయాలకు అతీతమైనప్పటికీ పురంధేశ్వరి టీడీపీలో చేరుతుందనే పుకార్లకు మరింత బలం చేకూరుతోంది. పురంధేశ్వరి టీడీపీలో చేరుతోందని,గుడివాడలో పురంధేశ్వరిని పోటీకి దింపడం ద్వారా కొడాలి నానికి గట్టి దెబ్బ ఇవ్వాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు గతంలో ప్రచారం జరిగింది.