టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరనున్న పీజేఆర్ కుమార్తె!

తెలంగాణ రాష్ట్ర సమితి ఖైరతాబాద్ డివిజన్ కార్పొరేటర్ పి విజయారెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ మాజీ కాంగ్రెస్లెజిస్లేచర్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి దివంగత పి.జనార్దన్ రెడ్డి కుమార్తె, విజయారెడ్డి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. ఉజ్వల భవిష్యత్తు కోసం పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు.
పీజేఆర్‌ వారసత్వాన్ని కొనసాగించేందుకు కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నాను. ఇంటి పార్టీలోకి తిరిగి వచ్చినట్లు అనిపిస్తుంది అని విజయారెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఇచ్చిన అన్ని పనులను నెరవేర్చి అమలు చేస్తున్నప్పటికీ ఎలాంటి గుర్తింపు లభించలేదన్నారు.
నా ప్రతిభను, సత్తాను చాటుకోవడానికి కాంగ్రెస్ సరైన వేదికను అందిస్తుందని భావించాను, అందుకే ఆ పార్టీలో చేరుతున్నానని రేవంత్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో విజయారెడ్డి అన్నారు. తనకు ఎమ్మెల్యే టిక్కెట్టు కేటాయిస్తానని కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి హామీ రానప్పటికీ ఎన్నికలకు ఇంకా సమయం ఉందని విజయారెడ్డి తెలిపారు. ఇలాంటి అంశాలపై చర్చించేందుకు ఇది సరైన సమయం కాదని ఆమె అన్నారు.
2007లో తండ్రి మరణానంతరం కాంగ్రెస్‌లో ఉన్న విజయారెడ్డి ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరి ఖైరతాబాద్‌ నుంచి రెండుసార్లు జీహెచ్‌ఎంసీకి ఎన్నికయ్యారు. పార్టీలో కీలక పాత్ర పోషించినా ఆమెకు అసెంబ్లీ టిక్కెట్ దక్కలేదు. ఈసారి తనను హైదరాబాద్ మేయర్‌గా చేస్తారని భావించిన ఆమె ఆ ఛాన్స్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు కుమార్తె గద్వాల్ విజయలక్ష్మికి దక్కింది.మేయర్ ఎన్నికలను బహిష్కరించి సభాస్థలి నుంచి ఆగ్రహంతో బయటకు వెళ్లిన ఆమెను టీఆర్‌ఎస్‌ అధిష్టానం శాంతింపజే సింది.
అప్పటి నుండి, ఆమె టిఆర్ఎస్ పార్టీ వ్యవహారాల పట్ల అంటీ ముట్టనట్టు గా వ్యవహరిస్తోంది ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో తనకు పార్టీ టికెట్ వస్తుందన్న ధీమాతో ఆమె మళ్లీ కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు.

Previous articleచంద్రబాబుతో మైండ్ గేమ్ ఆడుతున్న పవన్!
Next articleసహజ వనరులను వైసీపీ మాఫియా దోచుకుంటోంది : లోకేశ్