భారత్ నిర్మాణ సమితి, భారత్ ప్రజా సమితి, భారత రాష్ట్ర సమితి అనే మూడు పేర్లను సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. కేంద్ర ఎన్నికల సంఘం వద్ద కొత్త పార్టీ నమోదు ప్రక్రియ కూడా చివరి దశలో ఉంది. పార్టీ పేరును ప్రకటించడంతోపాటు విధి విధానాలు, కార్యక్రమాలను వెల్లడించేందుకు కేసీఆర్ సమాయత్తమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. జూన్ 23లోపు ప్రకటన వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
కర్ణాటకలో జనతాదళ్ వంటి వివిధ ప్రాంతీయ పార్టీల జాతీయ అగ్రనేతలను కలిసే ప్రక్రియను కేసీఆర్ ఇప్పటికే ప్రారంభించారు. ఆయన ఇప్పటికే జార్ఖండ్, ఢిల్లీ,పంజాబ్, మహారాష్ట్ర, తమిళనాడు ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు.ఆయన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలవడానికి సిద్ధంగా ఉన్నారు.
కొత్త పార్టీని ప్రారంభించిన వెంటనే కేసీఆర్ ఢిల్లీ లేదా దాని పరిసరాల్లో భారీ బహిరంగ సభలో ప్రసంగించే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఉత్తర భారతదేశంలో భారీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను కేసీఆర్ ప్లాన్ చేసే అవకాశం ఉంది. దక్షిణ భారతదేశంలోని ప్రాంతీయ పార్టీల మద్దతు లభిస్తుందని ఆయన భావిస్తున్నారు. పార్టీకి ఎన్నికల చిహ్నంగా కారు ఉండే అవకాశం ఉంది.