మాస్ మహరాజ్ రవితేజ చేతుల మీదుగా ‘‘చోర్ బజార్’’ చిత్రం సాంగ్ విడుదల

ఆకాష్ పూరి ‘‘చోర్ బజార్’’ సినిమాను సపోర్ట్ చేసేందుకు ముందుకొచ్చారు మాస్ స్టార్ రవితేజ. ఈ చిత్రంలోని ‘బచ్చన్ సాబ్ ఫ్యాన్ ఆంథమ్’  లిరికల్ సాంగ్ ను ఆయన తాజాగా విడుదల చేశారు. రవితేజ కూడా అమితాబ్ అభిమానే. తన సినిమాల్లో అమితాబ్ డైలాగ్స్ చెబుతుంటారు. పూరీ ఫ్యామిలీతో తనకున్న అనుబంధం, అటు తన ఫేవరేట్ స్టార్ పేరు మీద చేసిన పాట కాబట్టి రవితేజ సంతోషంగా ఈ పాటను విడుదల చేశారు. ‘బచ్చన్ సాబ్ ఫ్యాన్ ఆంథమ్’ బాగుందని, ‘‘చోర్ బజార్’’ సినిమా హిట్ అవ్వాలని ఆయన విశెస్ తెలిపారు.

‘బచ్చన్ సాబ్ ఫ్యాన్ ఆంథమ్’  పాటను మదీన్ ఎస్కే స్వరకల్పనలో మిట్టపల్లి సురేందర్ సాహిత్యాన్ని అందించగా మంగ్లీ పాడారు. ఈ పాట ఎలా ఉందో చూస్తే..షోలే సినిమా విడుదలైన మొదటి ఆటకి సోలోగానే వెళ్లిపోయా ఎక్స్ రోడ్డుకి. ఆ యాంగ్రీ యంగ్ మ్యాన్ ఎంట్రీ ఇచ్చే సీను. ఆరడుగుల డాన్ చేతిలో మౌత్ ఆర్గాను. నన్నే చూస్తు ప్లే చేస్తుంటే ఫ్లాట్ అయ్యాను…అంటూ సాగుతుందీ పాట.

ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వీ.ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమాకు జీవన్ రెడ్డి దర్శకత్వం వహించారు. గెహనా సిప్పీ నాయికగా నటించింది. లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన “చోర్ బజార్” ఈనెల 24న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలు, ట్రైలర్ కు మంచి స్పందన వస్తూ సినిమా మీద అంచనాలు పెంచుతోంది. యూవీ క్రియేషన్స్ సంస్థ సమర్పకులుగా వ్యవహరించడం చిత్రానికి మరో హైలైట్ గా చెప్పుకోవచ్చు.

Previous articleజూన్ 23లోపు కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటిస్తారా?
Next articleSai Pallavi