నాని, వివేక్ ఆత్రేయ, మైత్రీ మూవీ మేకర్స్ ‘అంటే.. సుందరానికీ’

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అంటే సుందరానికీ’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా మూడు భాషల్లో ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ రోజు చిత్రం నుండి  గ్లింప్స్ ద్వారా  థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటించారు నిర్మాతలు. ఈ వీడియోలో ప్రతి నటీనటులు అయోమయంగా గంధరగోళంగా కనిపిస్తూ ..చివరకు నాని, నజ్రియా ‘అంటే సుందరానికి’ థియేట్రికల్ ట్రైలర్ జూన్ 2న విడుదలవుతుందని వెల్లడించారు. ఈ ట్రైలర్ మరింత వినోదాత్మకంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఈ చిత్రానికి రవితేజ గిరిజాల ఎడిటర్‌గా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్ పని చేస్తున్నారు. ఈ చిత్రం తమిళ వెర్షన్‌కి ‘అడాడే సుందరా’ అనే టైటిల్‌ని పెట్టగా, మలయాళ వెర్షన్‌కి ‘ఆహా సుందరా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. జూన్ 10న మూడు భాషల్లో ఒకేసారి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Previous articleతెలంగాణలో కాంగ్రెస్‌కు పెరుగుతున్న ఆదరణపై బీజేపీ ఆందోళన చెందుతోందా?
Next articleప్రేక్ష‌కుల‌కు న‌వ్వులు పండించ‌డంలో ఎవ‌ర్‌గ్రీన్ చిత్రం ఎఫ్‌3