టీఆర్ఎస్ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు కేసీఆర్ డ్రామా!

భారతీయ జనతా పార్టీని ఎదిరించినందుకు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుకు పట్టిన గతే పడుతుందని, భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రజల ఆదరణ త్వరితగతిన కోల్పోతున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు కేసీఆర్‌ డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు.
2018-19లో కూడా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇలాంటి రాజకీయాలు చేసినా ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో భారీగా నష్టపోయారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది.ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించిందో టీఆర్‌ఎస్‌ కూడా అలాగే వ్యవహరిస్తోందని అన్నారు. దేశవ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ పాత్ర అంతంతమాత్రంగానే ఉందని, జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ పాత్ర పోషించే అవకాశాలు తక్కువని జీవీఎల్‌ చెప్పారు.
అయినా తెలంగాణ ముఖ్యమంత్రి జాతీయ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తానని చెప్పారు. అతను కేవలం మూర్ఖుల స్వర్గంలో ఉన్నాడు, అని జీవీఎల్‌ చెప్పాడు.
తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వ ఖజానాను ఖర్చుపెట్టి జాతీయ పర్యటనలు చేపట్టడాన్ని జీవీఎల్‌ తప్పుబట్టారు. టీఆర్‌ఎస్ అధినేత చేస్తున్న నిరాధార ప్రచారాన్ని ఉత్తర భారత రైతులు నమ్మరని గుర్తు చేశారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో కూడా కొన్ని పార్టీలు బీజేపీ రైతులకు వ్యతిరేకమని ప్రచారం చేశాయి.అయితే యోగి ప్రభుత్వంపైన, ప్రధాని నరేంద్ర మోదీపైన నమ్మకం ఉన్నందునే రైతులు బీజేపీకి ఓటేశారు అని బీజేపీ నేత జీవీఎల్‌ వ్యాఖ్యానించారు.

Previous articleతెలంగాణ బిజెపి లో రాజ్యసభ సీటు ఎవరికి దక్కనుంది?
Next articleఎమ్మెల్సీ అరెస్ట్‌పై వైఎస్సార్‌సీపీ దళిత నేతలు మౌనం!