రేంజ్ రోవర్ టైటిల్ & ఫస్ట్ లుక్ విడుదల చేసిన నటుడు అలీ !!!

ఓఎస్ఆర్ కుమార్ ఇండియన్ పిక్చర్స్ బ్యానర్ లో ఆట సందీప్ హీరోగా నటిస్తున్న రెండో సినిమా రేంజ్ రోవర్ టైటిల్ మరియు ఫస్ట్ లుక్ నటుడు అలీ విడుదల చేశారు. మేఘన రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అరవింద్ యతిరాజ్, బ్యాంక్ జనార్దన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. జ్యోతి రాజ్ ఐటమ్ సాంగ్ లో కనిపించనుంది.
ఓఎస్ఆర్ కుమార్ దర్శకత్వంతో పాటు నిర్మాతగా  తెరకెక్కుతున్న ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలో చిత్ర ట్రైలర్, సాంగ్స్ ను యూనిట్ విడుదల చేయనుంది. 
చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ… ఓఎస్అర్ కుమార్ దర్శకత్వంలో..ఆట సందీప్ చేస్తున్న ఈ సినిమా విజయం కావాలని కోరుకుంటున్నాను. రేంజ్ రోవర్ టైటిల్ బాగుంది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులు విజయం చేస్తారని ఆశిస్తున్నాను. చిత్ర యూనిట్ సభ్యులందరికి ఆల్ ది బెస్ట్ తెలుపుతున్నాను అన్నారు. 

Previous articleపార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ – ‘ఎఫ్3’ మూవీ నుండి పూజా హెగ్డే స్పెషల్ ‘
Next articleఎఫ్‌ 3.. పక్కా ఫైసా వసూల్‌ మూవీ…