విజయ్ దేవరకొండ, సమంత టైటిల్ “ఖుషి”

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్సి నిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సమంత ఆయనకు జోడీగా కనిపించనుంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వై రవిశంకర్, నవీన్ యేర్నేని నిర్మాతలు. మంచి రొమాంటిక్ కామెడి గా రాబోతున్న ఈ సినిమా ఇటీవలే కాశ్మీర్ లో షూటింగ్ప్రా రంభించుకుంది.ప్రస్తుతం అక్కడే రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకుంటోంది.

తాజాగా ఈ సినిమాకు “ఖుషి” టైటిల్ ఖరారు చేశారు. విజయ్ దేవరకొండ, సమంత ఫస్ట్ లుక్  విడుదల చేశారు.  ఫస్ట్ లుక్ లో ఈ జంట లవ్లీగా కనిపిస్తున్నారు.  విజయ్,సమంత కెరీర్ లలో ఇదొక మెమొరబుల్ ఫిల్మ్ గా మిగులిపోతుందనే వైబ్స్ టైటిల్, ఫస్ట్ లుక్ తో ఏర్పడుతున్నాయి. ప్రేమలో గెలిస్తే ఖుషి, ఆ ప్రేమను కుటుంబంతో పంచుకుంటే మరింత ఖుషి. జీవితంలో ఈ సంతోషాన్ని మించిన సంపద లేదు అన్నట్లు “ఖుషి” టైటిల్, ఫస్ట్ లుక్ డిజైన్క్రి యేటివ్ గా ఉండి ఆకట్టుకుంటున్నాయి. డిసెంబర్ 23,2022 న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు.

ఈ సినిమా కశ్మీర్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత హైదరాబాద్, వైజాగ్, అల్లెప్పి లలో మిగతా షూటింగ్ చేయనున్నారు.

నటీనటులు: విజయ్ దేవరకొండ, సమంత, జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు.

Previous article‘ఎఫ్3’ మూవీ నుండి పూజా హెగ్డే స్పెషల్ ‘లైఫ్
Next articleటీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ నమస్తే తెలంగాణ ఎండీ?