అనసూయ బర్త్ డే ‘వాంటెడ్ పండుగాడ్’ నుంచి ఫస్ట్ లుక్

తాధిక చిత్ర ద‌ర్శ‌కుడు.. ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో యునైటెడ్ కె ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సునీల్, అన‌సూయ భ‌ర‌ద్వాజ్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా శ్రీధ‌ర్ సీపాన ద‌ర్శ‌క‌త్వంలో సాయిబాబ కోవెల మూడి, వెంక‌ట్ కోవెల మూడి నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం ‘వాంటెడ్ పండుగాడ్’. ‘పట్టుకుంటే కోటి’ ట్యాగ్ లైన్. ఆదివారం అన‌సూయ భ‌ర‌ద్వాజ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా నుంచి అనసూయ ఫ‌స్ట్ లుక్‌తో పాటు వీడియోను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

ఈ సంద‌ర్బంగా నిర్మాత‌లు మాట్లాడుతూ ‘‘శ్రీధర్ సీపానగారి దర్శకత్వంలో హిలేరియస్ ఎంటర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న సినిమా ‘వాంటెడ్ పండుగాడ్’ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా ఉంటుంది. ప్ర‌ముఖ ర‌చ‌యిత జ‌నార్ధ‌న మ‌హ‌ర్షి ఈ చిత్రానికి క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. మారేడుమిల్లిలో పెద్ద షెడ్యూల్‌ను పూర్తి చేశాం. త‌ర్వాత హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో కొంత షూటింగ్ చేశాం. సినిమా షూటింగ్ దాదాపు పూర్త‌య్యింది. మూడు, నాలుగు రోజులు మాత్ర‌మే బ్యాలెన్స్ ఉంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి త్వ‌ర‌లోనే సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం’’ అన్నారు.

నటీనటులు:సునీల్, అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, వెన్నెల కిషోర్‌, స‌ప్త‌గిరి, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుధీర్‌, దీపికా పిల్లి, బ్ర‌హ్మానందం, ర‌ఘుబాబు, అనంత్, పుష్ప జ‌గ‌దీష్‌, నిత్యా శెట్టి, వసంతి, విష్ణు ప్రియ‌, హేమ‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, ఆమ‌ని, థ‌ర్టీ ఇయ‌ర్స్ పృథ్వీ త‌దిత‌రులు

Previous articleఅశ్విన్ బాబు, అనీల్ కన్నెగంటి ‘హిడింబ’ ఫస్ట్ గ్లింప్స్ విడుదల
Next article‘మా’ ఆధ్వర్యంలో  AIG హాస్పిటల్ లో ఆర్టిస్ట్ లకు హెల్త్ క్యాంప్