అశ్విన్ బాబు, అనీల్ కన్నెగంటి ‘హిడింబ’ ఫస్ట్ గ్లింప్స్ విడుదల

యంగ్ హీరో అశ్విన్ బాబు, దర్శకుడు అనీల్ కన్నెగంటి కాంబినేషన్ లో ఎస్వీకే సినిమాస్ బ్యానర్‌పై గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్న హై ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్ హిడింబ. ఈ చిత్రంలో అశ్విన్ బాబుకు జోడిగా నందితా శ్వేత కథానాయికగా నటిస్తోంది.

కొద్దిసేపటి క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ గ్లింప్స్‌ రిలీజ్ అయ్యింది. ఫస్ట్‌ గ్లింప్స్‌ లో యాక్షన్ అదిరిపోయింది. అశ్విన్ బాబు రౌడీలని కొడుతున్న ఫైట్ సీక్వెన్స్ టెర్రిఫిక్ గా వుంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అద్భుతంగా ఉన్నాయి.

దర్శకుడు అనీల్ కన్నెగంటి అశ్విన్ బాబుని పవర్ ఫుల్ పాత్రలో చూపించారు. నందితా శ్వేత పోలీస్‌గా కనిపించింది. సుభలేఖ సుధాకర్ రాజకీయ నాయకుడిగా కనిపించారు.  .

హిడింబ ఫస్ట్ అశ్విన్ బాబు హైలీ యాక్షన్, ఫస్ట్-క్లాస్ సాంకేతిక విలువలతో ఆకట్టుకుంటుంది.

ఈ చిత్రానికి వికాస్ బాడిసా సంగీతం అందించగా, రాజశేఖర్ బి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

తారాగణం: అశ్విన్ బాబు, నందితా శ్వేత, శుభలేఖ సుధాకర్ తదితరులు

Previous articleఇచ్ఛాపురం నియోజకవర్గంలో త్రిముఖ పోటీ?
Next articleఅనసూయ బర్త్ డే ‘వాంటెడ్ పండుగాడ్’ నుంచి ఫస్ట్ లుక్