నాగశౌర్య, అనీష్‌ ఆర్‌ కృష్ణ, ఐరా క్రియేషన్స్‌ ‘కృష్ణ వ్రింద విహారి’ మే 20న గ్రాండ్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా అనీష్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. ఇప్పటికే టీజర్, ఫస్ట్ సింగల్ తో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచిన ఈ చిత్రం కొత్త విడుదల తేదిని చిత్ర యూనిట్ ప్రకటించింది. ‘కృష్ణ వ్రింద విహారి’ సమ్మర్ రేసులోనే మే20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో నాగశౌర్య సూపర్ కూల్‌గా కనిపించారు.  

ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్ర టీజర్ కు అన్నివర్గాల ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించింది. సినిమా ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి. మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా విడుదలైన ఈ చిత్రంలో మొదటి పాట ‘వర్షంలో వెన్నెల’ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఈ పాటలో నాగ శౌర్య, షిర్లీ సెటియా కెమిస్ట్రీ ఆకట్టుకుంది. మహతి స్వరసాగర్‌ స్వర పరిచిన ఈ పాట వీక్షకులని అమితంగా అలరించింది.

డిఫరెంట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ ట్రైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మిస్తుండగా, శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి సాయిశ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా, తమ్మిరాజు ఎడిటర్ గా పనిచేస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ రాధిక ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. తారాగణం: నాగ శౌర్య, షిర్లీ సెటియా, రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు

Previous articleMegastar and Mega Power Star
Next articleఅరకు ఎంపీ మిస్సింగ్!