సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వ్యవసాయ శాఖ మంత్రి, కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సినిమాల్లో నటించి కోట్ల రూపాయలు కూడబెట్టడం పవన్‌కు మాత్రమే తెలుసునని కాకాణి అన్నారు. పవన్ కళ్యాణ్ వ్యవసాయం గురించి మాట్లాడటం ఒక జోక్ అని అన్నారు. ఎమ్మెల్యేగా కూడా గెలవలేడు. సొంతంగా ఎమ్మెల్యేగా కూడా గెలవలేని పవన్‌ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కాకాణి అన్నారు.
గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు.ఆంధ్రప్రదేశ్‌లో మూడేళ్లలో 3000 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. దేశంలోనే రైతు ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో ఉందని, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉందని పవన్ అన్నారు. రైతుల ఆత్మహత్యలకు వైఎస్సార్‌సీపీయే కారణమని ఆరోపించారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో వైసీపీ విఫలమైందని పవన్ ఆరోపించారు.
రైతులు వ్యవసాయ భూములను కౌలుకు తీసుకుని ప్రయివేటు వడ్డీ వ్యాపారుల వద్ద వడ్డీలకు అప్పులు చేశారని, అందుకు అధిక వడ్డీలు చెల్లించారని పవన్ అన్నారు. పెరిగిపోతున్న అప్పులు తీర్చలేక చాలా మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని పవన్ అన్నారు.