రాష్ట్రంలో మొదటి మొబైల్ సినిమా ధియేటర్!

రాష్ట్రంలో మొదటి మొబైల్ సినిమా ధియేటర్దీ న్ని ట్రక్కులో ఎక్కడికైనా తీసుకుని వెళ్లి అమర్చుకోగల మొబైల్ సినిమా హాల్ . రాజానగరం వద్ద నేషనల్ హైవే పక్కన హాబిటేట్ ఫుడ్ కోర్టు ప్రాంగణంలో ఈ ధియేటర్ ఏర్పాటౌతోంది. వెదర్ ప్రూఫ్,ఫైర్ ఫ్రూఫ్ పద్ధతుల్లో వేసిన టెంట్ లో గాలినింపే టెక్నాలజీతో 120 సీట్ల కెపాసిటీతో ఈ ఎసి ధియేటర్ ను రూపొందిస్తున్నారు.

“పిక్చర్ డిజిటల్స్” సంస్ధ ఏపీలో నెలకొల్పుతున్న మొబైల్ ధియేటర్లలో ఇది మొదటిదని,ఆచార్య సినిమాతో ధియేటర్ ప్రారంభమౌతుందని సంస్ధ ప్రతినిధి చెప్పారు.

Previous articleనెల్లూరులో బలపరీక్షకు సిద్ధమైన మంత్రి, మాజీ మంత్రి!
Next articleనిఖిల్, గ్యారీ బిహెచ్, ఎడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పాన్ ఇండియా మూవీ టైటిల్ ‘స్పై’