అక్కినేని అఖిల్ కు సరికొత్త పోస్టర్ ‘ఏజెంట్’ యూనిట్

యంగ్ అండ్ డైనమిక్ స్టార్ అక్కినేని అఖిల్ హీరోగా స్టయిలీష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌, సురేందర్ 2 సినిమా బ్యానర్స్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ‘ఏజెంట్’ యూనిట్ సరికొత్త పోస్టర్ తో విషేష్ తెలిపింది. ‘ఏజెంట్’ పాత్ర ప్రకారం అఖిల్ ఇదివరకటి సినిమాల కంటే పూర్తి భిన్నంగా కనిపించబోతున్నారు. ఫుల్ లెంత్ యాక్షన్ రోల్ చేస్తున్న అఖిల్  ‘ఏజెంట్’ పాత్ర కోసం పూర్తిగా మేకోవ‌ర్ అయ్యారు.

తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో కండలు తిరిగిన శరీరంతో స్టయిలీష్ గా సిగరెట్ తాగుతూ ‘ఏజెంట్’ యాటిట్యూడ్ తో కనిపించడం అభిమానులు ఆకట్టుకుంది. ‘ఏజెంట్’ పాత్ర కోసం అఖిల్ ఎంతలా మేకోవ‌ర్ అయ్యారో చెప్పడానికి ఈ పోస్టర్ నిదర్శనంగా నిలిచింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ రచయిత, దర్శకులు వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ అందించారు. ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా ‘ఏజెంట్ ‘చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తారాగణం: అక్కినేని అఖిల్, సాక్షి వైద్య, మమ్ముట్టి

Previous articlepallavi
Next articleహల్ చల్ చేస్తున్న మంచు విష్ణు, సన్నీలియోన్ సరదా రీల్!