ఆగస్టు 12న సమంత – శ్రీదేవి మూవీస్ ‘యశోద’ విడుదల

తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించిన సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌తో నేషనల్ స్టార్‌గా ఎదిగారు. ఆమె ప్రధాన పాత్రలో రూపొందుతున్న తాజా సినిమా ‘యశోద’. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. హరి – హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. ఆగస్టు 12న ఈ సినిమా విడుదల కానుంది.
నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ “యశోద’లో సమంత నటనతో పాటు యాక్షన్ సీక్వెన్స్‌ల‌లో ఫెంటాస్టిక్ పెర్ఫార్మన్స్‌తో ఆకట్టుకుంటారు. ఆగస్టు 12న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏక కాలంలో చిత్రాన్ని విడుదల చేస్తాం. మే నెలాఖరుకు చిత్రీకరణ అంతా పూర్తవుతుంది. యాక్షన్ థ్రిల్లర్ జాన‌ర్‌లో జాతీయ స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కథాంశంతో తెరకెక్కిస్తున్న చిత్రమిది. హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్స్‌లో ఇటీవల చిత్రీకరణ ముగిసింది. ఈ రోజు కొడైకెనాల్ లో తాజా షెడ్యూల్ ప్రారంభించాం” అని చెప్పారు.


సమంతతో పాటు వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులు ఈ చిత్రం ప్రధాన  తారాగ‌ణం.

Previous articleLatest pictures of Gorgeous diva Nabha Natesh
Next articleChithra Shukla