సూపర్ స్టార్ మహేష్ బాబు `సర్కార్ వారి పాట` యాక్షన్-ప్యాక్డ్ పోస్టర్ విడుద‌ల‌

పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు యాక్షన్,  ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ `సర్కారు వారి పాట` ఈ సంవత్సరం విడుదలవుతున్న మోస్ట్ ఎవైటెడ్ చిత్రాలలో ఒకటి. వేసవిలో సినిమా అభిమానులకు ‘సూపర్ స్పెషల్’ ట్రీట్‌ను అందించడానికి ఈ చిత్రాన్ని మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఉగాది సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, చిత్ర నిర్మాతలు స‌రికొత్త  యాక్షన్-ప్యాక్డ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. మహేశ్ బాబుపై గూండాలు ఆయుధాలతో దాడికి సిద్ధపడుతుండ‌గా, ‘సూపర్ స్టార్’ తన బెల్ట్ తీస్తూ, వారిపై దాడికి సిద్ధంగా వున్నాడు. ఈ గెట‌ప్‌లో మ‌హేష్ కూల్‌గా, మోడిష్‌గా కనిపిస్తున్నా దాడి చేయ‌డానికి ధృడంగా వున్న‌ట్లు అత‌ని లుక్ తెలియ‌జేస్తోంది. చిత్రానికి సంబంధించిన రెండు పాట‌ల‌కు అద్భుతమైన స్పందన రావడంతో మ్యూజికల్ ప్రమోషన్‌లు కూడా జోరందుకున్నాయి. కళావతి మెలోడీ ప్రేమికులను ఆకర్షించగా, రెండవ ట్రాక్, మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని తొలిసారిగా కనిపించిన పెన్నీకి అద్భుతమైన స్పందన వచ్చింది. సితార డ్యాన్స్‌కు పలువురు మెచ్చుకున్నారు.

ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎస్ థమన్ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్ ఇస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది.

Previous articleనంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ‘బింబిసార’.. ఆగస్ట్ 5న గ్రాండ్ రిలీజ్
Next articleప్రత్యేక పోస్టర్ల తో F3 టీమ్ వస్తోంది