టీడీపీ లక్ష్యం 150 సీట్లు ? 70 నియోజకవర్గాల్లో బలహీనంగా ఉంది !

2024లో జరగనున్న ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు టీడీపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. పార్టీ క్యాడర్‌ను చైతన్యవంతం చేయడానికి, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి , గెలుపు కోసం కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోంది. కానీ, టీడీపీ అధినేత చేస్తున్న రియాలిటీ చెక్ మాత్రం ఆ పార్టీ నాయకత్వానికి గుబులు పుట్టిస్తోంది.
కారణం? మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ దాదాపు 70 స్థానాల్లో బలహీనంగా ఉంది. పార్టీ క్యాడర్‌ జారిపోయి చాలా మంది ఇతర పార్టీల్లో చేరారు.
వైఎస్సార్‌సీపీ మంత్రులు ఇబ్బంది పెట్టడం వల్ల వారు ఇతర పార్టీల్లోకి చేరారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీకి యాక్టివ్‌గా ఉన్న నియోజకవర్గ ఇంచార్జిలు లేరు. దీంతో ఈ నియోజకవర్గాలపై ఆ పార్టీకి పెద్దగా ఆశలు లేవు. టీడీపీకి మరో పెను సవాల్ ఏంటంటే నిష్క్రియ నేతలు. గతంలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేసిన చాలా మంది నేతలు ఇప్పుడు అచేతనంగా ఉన్నారు. నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు.
ప్రస్తుతం ఆ పార్టీ కేవలం 105 స్థానాల్లో యాక్టివ్‌గా ఉంది. టీడీపీ అధికారంలోకి రావాలంటే కనీసం 90 సీట్లు గెలవాలి.వైఎస్సార్‌సీపీకి ఉన్న బలమైన క్యాడర్, మద్దతు, సంస్థాగత బలం దృష్ట్యా టీడీపీ ఆ రకంగా విజయం సాధిస్తుందని ఆశించలేం. తద్వారా కనీసం 150 స్థానాల్లోనైనా పార్టీని బలోపేతం చేసి వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా గట్టిపోటీని ఎదుర్కోవాలని టీడీపీ యోచిస్తున్నట్లు సమాచారం.

Previous articleఆర్ఎస్ఎస్ సీనియర్ నేతను కలిసేందుకు కేసీఆర్ ప్రయత్నించారా?
Next articleహైకోర్టు తీర్పు పై ఐఏఎస్ అధికారుల్లో చర్చ…