25 కోట్లకు అమ్ముడైన వరుణ్ తేజ్ ‘గని’ సినిమా అన్ని భాషల ఓటిటి, శాటిలైట్ రైట్స్..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న సినిమా గని. అల్లు బాబీ కంపెనీ, Renaissance పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. సిద్దు ముద్ద, అల్లు బాబీ ఈ సినిమాకు నిర్మాతలు. ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ మధ్యే విడుదలైన ట్రైలర్ పై మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా వరుణ్ తేజ్ మేకోవర్ అందరికీ బాగా నచ్చేస్తుంది. ఒక్క కట్ కూడా లేకుండా ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. తాజాగా ఈ సినిమా అన్ని భాషల ఓటిటి, శాటిలైట్ రైట్స్ 25 కోట్లకు అమ్ముడయ్యాయి. కేవలం ట్రైలర్ మాత్రమే చూసి ఈ సినిమాకు భారీ బిజినెస్ జరిగింది. సినిమాను అద్భుతంగా ఉంటుందని ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న గని ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు. నటీనటులు: వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్, జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర తదితరులు

Previous article2022, జులై 1న విడుదల కానున్న మ్యాచో హీరో గోపీచంద్ – మారుతి కాంబినేష‌న్‌లో  ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్’..
Next articleగని లో యాక్షన్ సీన్స్ అందర్నీ ఆకట్టుకుంటాయి.