ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా ఎప్రిల్ 2న వైజాగ్‌లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘గని’ ప్రీ రిలీజ్ వేడుక..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన సినిమా గని. అల్లు బాబీ కంపెనీ, Renaissance పిక్చర్స్ బ్యానర్స్‌పై సిద్ధూ ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు కూడా మంచి స్పందన వచ్చింది.

టీజర్, ట్రైలర్‌కు అనూహ్యమైన స్పందన రావడంతో.. అంచనాలు కూడా భారీగానే పెరిగిపోయాయి. ముఖ్యంగా వరుణ్ తేజ్ మేకోవర్ అందరికీ బాగా నచ్చేస్తుంది. ఈ సినిమా ఎప్రిల్ 8న విడుదల కానుంది. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఒక్క కట్ కూడా లేకుండా U/A సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక వైజాగ్‌లో ఎప్రిల్ 2న జరగనుంది. దీనికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రానున్నారు. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం వచ్చింది. సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.

నటీనటులు: వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్, జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర తదితరులు

Previous articleరెగ్యులర్ షూటింగ్‌లో సుధీర్ బాబు – భవ్య క్రియేషన్స్ యాక్షన్ థ్రిల్లర్
Next articleసూపర్ స్టార్ విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో భారీ యాక్షన్ డ్రామాగా  ‘జేజీఎం’  (జనగణ మన)