ఏపీలో మార్చి 31న కొత్త జిల్లాల నోటిఫికేషన్!

అన్నీ సవ్యంగా సాగితే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త జిల్లాలు మార్చి 31 నుంచి అమల్లోకి రానున్నాయి. అందుకు సంబంధించిన నోటిఫికేషన్ మార్చి 31న విడుదల కానుంది. శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి తో వైఎస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ప్రతిపాదిత జిల్లాల కోసం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత, 9000 ఫిర్యాదులు ,అభ్యంతరాలు వచ్చాయి.ఎక్కువ ఫిర్యాదులు,అభ్యంతరాలు ప్రజాప్రతినిధుల నుంచి వచ్చినవే. వాటిలో చాలా వరకు జిల్లాల పేరు మార్పుకు సంబంధించినవి కాగా, కొన్ని జిల్లా కేంద్రాలకు సంబంధించినవి. వివిధ అభ్యంతరాల స్థితిగతుల గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి వివరించారు
దాదాపు గంటన్నరపాటు సమీక్షా సమావేశం కొనసాగింది. అన్నమయ్య జిల్లాకు రాయచోటిని ప్రధాన కేంద్రంగా చేయడంపై ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి.దీనికి బదులు రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి సహా పలువురు రోడ్డెక్కారు.
చిత్తూరులోని మదనపల్లిని ప్రత్యేక జిల్లాగా చేయాలన్నది మరో ప్రధాన డిమాండ్. ఇది చాలా కాలంగా ఉన్న డిమాండ్‌తో ఇక్కడ కూడా ప్రజలు రోడ్డెక్కారు. అదేవిధంగా కొత్తగా ఏర్పాటైన నర్సాపురం జిల్లాకు భీమవరాన్ని జిల్లా కేంద్రంగా చేయడంపై కూడా వ్యతిరేకత చర్చనీయాంశంగా మారింది.ఈ సమస్యలను పరిష్కరించాలని జగన్ యోచిస్తున్నారని, మార్చి 31న తుది నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు

Previous articleకొత్త సినిమా షూటింగ్‌తో సెట్స్‌లోకి అడుగు పెడుతున్న  సాయి ధ‌ర‌మ్ తేజ్ 
Next articleఏప్రిల్ 11న జగన్ కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనుందా?