సంచలనం సృష్టిస్తున్న అజిత్ కుమార్ ‘వలీమై’

ZEE5 లో స్ట్రీమింగ్ మొదలైన అతి తక్కువ సమయంలోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను పూర్తి చేసుకుంది. చలనచిత్ర ప్లాట్‌ఫామ్‌ లలోనే  ఇప్పటివరకు ఎవరికీ రానటువంటి అతిపెద్ద ఓపెనింగ్స్ తో దూసుకుపోతున్న ఫుల్ యాక్షన్ ఫ్యామిలీ ఏంటర్ టైనర్ “వలీమై”. “ZEE5 లో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ అవుతూ తెలుగు, తమిళం, కన్నడ మరియు హిందీలో అందుబాటులో కి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతూ.. అభిమానుల సందడితో దూసుకుపోతున్నందుకు ZEE5 టీం ఎంతో సంతోషంగా ఉంది. మొట్ట మొదటి సారిగా, ‘వలీమై సినిమా’ నుండి తొలగించబడిన సీన్స్ ఇప్పుడు ప్రసారం చేయబడు తున్నాయి. ఇందులో అజిత్ కుమార్ IPS ఆఫీసర్ అర్జున్‌ పాత్రలో నటించగా, హుమా ఖురైషీ ముఖ్య పాత్రలో నటించారు. ZEE5లో  స్ట్రీమింగ్‌ను అవుతున్న సందర్భంగా అజిత్‌ కుమార్‌ గౌరవార్ధం ZEE5` సంస్థ చెన్నైలోని వైయంసీఏ సర్కిల్‌లో 10,000 అడుగుల పొడవైన అతిపెద్ద పోస్టర్‌ను ఏర్పాటు చేసింది. భారతదేశం లో ఏ ఓటిటి సంస్థ ఇటువంటి అతి పెద్ద పోస్టర్ ను ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు. భారతీయ స్ట్రీమింగ్ చరిత్రలో ఇది తిరుగులేని రికార్డు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అజిత్‌ అభిమాను లతో పాటు, భారతీయ ప్రేక్షకుల కోసం  బ్లాక్‌బస్టర్‌ హిట్‌ చిత్రం ‘వలీమై’ మా జీ`5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ విడుదలైన అతి తక్కువ సమయంలోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను పూర్తి చేసుకొని విజయవంతంగా రన్ అవుతూ ప్రేక్షకుల హృదయాలను కొల్ల గొడుతున్నందుకు చాలా గర్వంగా ఉంది అన్నారు.

హెచ్.వినోత్ రచన మరియు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌తో కలిసి బేవ్యూ ప్రాజెక్ట్ ఎల్‌ఎల్‌పికి చెందిన బోనీ కపూర్ నిర్మించారు. ఈ చిత్రంలో హ్యూమా ఖురేషి, కార్తికేయ కథా, నాయికలుగా నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చగా, నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందించారు. ZEE5 అనేది వివిధ రకాల వినోద ఫార్మాట్‌లను అందించే ఏకైక వేదిక. వినోదాత్మక సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు డైరెక్ట్‌-టు-డిజిటల్‌ రిలీజ్‌లతో హిందీ, తెలుగు, తమిళం,కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ వంటి పలు భారతీయ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వీక్షకులకు ఎల్లప్పుడూ అద్భుతమైన చలనచిత్రాలను చందాదారులకు మరియు చలనచిత్ర ప్రియులకు ప్రతి నెలా తాజా కంటెంట్  ను అందిస్తూ ‘ZEE5 ఓటిటి’ అంటే ‘వినోదం మాత్రమే కాదు, అంతకు మించి’ అన్నట్లు దూసుకు పోతూ  అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకునేలా జాగ్రత్తలు తీసుకుంటూ అందరికళ్లూ తనవైపు తిప్పుకుంటోంది .ZEE5 యాప్ ద్వారా మొబైల్, టాబ్లెట్, డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌పై కేవలం ఒక క్లిక్ చేస్తే ఫుల్ ఏంటర్ టైన్మెంట్స్ అందిస్తుంది.

Previous articleActress Garima Kaushal Stills
Next articleఆర్ ఆర్ ఆర్ 2024 వరకు ఎంపీ గా కొనసాగనున్నారా?