మార్చి 28న విడుదల కానున్న హీరో నాగ శౌర్య “కృష్ణ వ్రిందా విహారి” టీజర్

యంగ్ & హ్యాండ్సమ్ హీరో నాగ శౌర్య నటిస్తున్న తాజా సినిమా కృష్ణ వ్రిందా విహారి. అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై రూపొందుతోంది.  నాగశౌర్య తొలిసారి బ్రాహ్మణ యువకుడిగా నటిస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది.  పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా ఫస్ట్లుక్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చిత్ర యూనిట్ టీజర్కి సంబంధించిన అప్డేట్ తో ముందుకు వచ్చింది. కృష్ణ  వ్రిందా విహారి టీజర్ను మార్చి 28న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పోస్టర్లో నాగ శౌర్య, షిర్లీ సెటియా రొమాంటిక్ పోజ్లో కనిపిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో అలనాటి నటి రాధిక ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ స్వరాలు సమకూరుస్తుండగా, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కృష్ణ  వ్రిందా విహారి వేసవి కానుకగా ఏప్రిల్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తారాగణం: నాగ శౌర్య, షిర్లీ సెటియా, రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు.

Previous articleపరిటాల కుటుంబం నుంచి ఒక్కరికే పార్టీ టికెట్ ?
Next articleకొత్త సినిమా షూటింగ్‌తో సెట్స్‌లోకి అడుగు పెడుతున్న  సాయి ధ‌ర‌మ్ తేజ్