‘ఆహా’ ప్రీమియర్‌గా మార్చి 25న  బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘భీమ్లా నాయక్’

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి, నిత్యా మీనన్, సంయుక్తా మీనన్ నటించిన మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘భీమ్లా నాయక్’.  100 % తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’ ప్రతి శుక్రవారం ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాను తెలుగు ప్రేక్ష‌కుకు అందిస్తోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ‘ఆహా’ ప్రీమియర్‌గా మార్చి 25న‌ సాగ‌ర్ కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన యాక్ష‌న్ డ్రామా ‘భీమ్లా నాయక్’ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి, నిత్యా మీన‌న్‌, సంయుక్తా మీన‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా న‌టించారు.  2022లో తెలుగు ఫిల్మ ఇండ‌స్ట్రీకి తొలి బిగ్గెస్ట్ హిట్ మూవీ ‘భీమ్లా నాయక్’. ఈ సినిమా ప్రీమియ‌ర్‌కు సంబంధించిన వివ‌రాల‌ను తెలియ‌జేస్తూ శుక్ర‌వారం ఆహా ఓ మోష‌న్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. 


‘భీమ్లా నాయక్’ సినిమా అహం.. ఆత్మ గౌర‌వానికి మ‌ధ్య జ‌రిగిన యుద్ధం. ఇన్‌స్పెక్టర్‌ భీమ్లా నాయ‌క్‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. రిటైర్డ్ మిల‌ట‌రీ ఆఫీస‌ర్ డానియ‌ల్ శేఖ‌ర్‌గా రానా ద‌గ్గుబాటి మ‌ధ్య సాగే పోరే ఈ చిత్రం. వీరిద్ద‌రితో పాటు సినిమాలో బ‌ల‌మైన మ‌హిళా పాత్ర‌లు క‌నిపిస్తాయి. ఇందులో భీమ్లా నాయ‌క్ భార్య‌గా నిత్యామీన‌న్‌.. డానియ‌ల్ శేఖ‌ర్ భార్య‌గా సంయుక్తా మీన‌న్ న‌టించారు. ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేష‌న‌ల్ త‌మ‌న్ అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. 
‘భీమ్లా నాయక్’ మూవీ రిలీజ్ అనౌన్స్‌మెంట్‌తో పాటు ‘లాలా భీమ్లా..’జింగల్‌ను కూడా ఆహా విడుద‌ల చేసింది. ఈ సినిమా టైటిల్ ట్రాక్ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది. దీన్ని మోష‌న్ పోస్ట‌ర్‌తో క‌లిపి #ఆహాలాభీమ్లా ఫ్ర‌మ్ మార్చి 25న అని ఆహా ప్ర‌క‌టించింది. అలాగే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ కోసం వారి మ‌ధ్య‌నే స్పెష‌ల్ ట్రైల‌ర్‌ను కూడా ఆహా విడుద‌ల చేసింది. 
2021లో  విడుద‌లైన క్రాక్‌, 11 అవ‌ర్‌, జాంబిరెడ్డి, ల‌వ్ స్టోరి, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌, డీజే టిల్లు, చావు కబురు చ‌ల్ల‌గా, నాంది, అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే, తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్‌, 3 రోజెస్‌, ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్‌, భామా క‌లాపం, కాలా, ఆహా భోజ‌నంబు, వ‌న్‌, సూప‌ర్ డీల‌క్స్, చ‌తుర్ ముఖం, త‌ర‌గ‌తి గ‌ది దాటి, ది బేక‌ర్ అండ్ ది బ్యూటీ, మ‌హా గ‌ణేశా, స‌ర్కార్‌, ప‌రిణ‌యం, ఒరేయ్ బామ్మ‌ర్ది, కోల్డ్ కేస్‌, అల్లుడు గారు, ఇచ్చట వాహ‌న‌ములు నిలుప‌రాదు వంటి చిత్రాలు, వెబ్ ఒరిజిన‌ల్స్‌తో ఆహా అన్ లిమిటెడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది.

Previous article2024లో కాపులు కొత్త చరిత్రను లిఖిస్తారా ?
Next articleనాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో  రూపొందుతోన్న ‘దసరా’ చిత్ర ఫస్ట్ లుక్