నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో  రూపొందుతోన్న ‘దసరా’ చిత్ర ఫస్ట్ లుక్

విభిన్నమైన చిత్రాలను చేస్తూ నేచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న హీరో నాని దసరా చిత్రంతో అలరించనున్నాడు. టాలెంటెడ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ గా దసరా రూపొందుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న నాని మొదటి పాన్ ఇండియా చిత్రం దసరా. సుధాకర్ చెరుకూరి తన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌లో దసరాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జాతీయ అవార్డు గెలుచుకున్న నటి కీర్తి సురేష్ నాయికగా నటిస్తోంది.

ఇటీవలే షూటింగ్ స్టార్ట్ అయింది. ఈరోజు ఈ సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు స్పార్క్ ఆఫ్ దసరా పేరుతో గ్లింప్స్ కూడా విడుదలయ్యాయి. పోస్టర్‌లో లుంగీ కట్టుకున్న నాని  పక్కనే నిప్పు ఉండటం దానిపై చెయ్యి పెడుతోన్న డిఫరెంట్ లుక్ నెటిజన్ల ను  ఆకట్టుకుంది. నాని తొలిసారి భిన్నమైన లుక్, గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. స్పార్క్ ఆఫ్ దసరా వీడియోలో నాని బీడీ వెలిగించి సింగరేణి మైన్స్ ద్వారా తన గ్యాంగ్‌తో కలిసి నడుస్తూ స్టైల్‌ గా ఎంట్రీ ఇచ్చాడు. నాని తన అగ్రెసివ్ యాటిట్యూడ్‌ తో అందరినీ ఆకట్టుకుంటున్నారు. దీనికి
సంతోష్ నారాయణన్  BGM తోడుకావడం నాని పాత్ర పై మరింత అంచనాలు పెంచాయి. గోదావరిఖనిలోని సింగరేణి కోల్ మైన్స్‌ దగ్గర ఉన్న ఒక గ్రామంలో జరిగే కథ ఇది. నాని మాస్, యాక్షన్-ప్యాక్డ్ పాత్రను పోషిస్తున్నాడు. దసరా యాక్షన్ డ్రామా. దసరా గ్లింప్స్ కు  అద్భుతమైన స్పందన వచ్చింది. సత్యన్ సూర్యన్ ISC సినిమాటోగ్రఫీతో సంతోష్ నారాయణన్ సంగీతం అందించనున్న ఈ చిత్రంలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ ముఖ్య తారాగణం. నాని, కీర్తి సురేష్, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ తదితరులు.

Previous article‘ఆహా’ ప్రీమియర్‌గా మార్చి 25న  బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘భీమ్లా నాయక్’
Next articleవారి స్నేహానికి రాజకీయాలు అడ్డుకాలేదు