రాజకీయ మార్పుతోపాటు సామాజిక మార్పు కొత్త శకంలో ఏపీలో 2024 ఎన్నికలు రాబోతున్నాయా? కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల నుంచి కాపు సామాజిక వర్గం అధికార పగ్గాలు చేపడుతుందా? సంఖ్యాపరంగా ప్రాబల్యం ఉన్న కాపులు ఈసారి పుంజుకుని రాజకీయంగా అధికారం చేజిక్కించుకుంటారా? దీనిపై రాజకీయ పండితులు తీవ్రస్థాయిలో చర్చించుకుంటున్నారు.
ఇప్పటికే పార్టీ ఆవిర్భావదిన వేడుకల సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగాన్ని రాజకీయ పండితులు చర్చించుకుంటున్నారు.పవన్ ప్రసంగంలో సామాజికంగా కాపులదే ఆదిపత్యం అంటూ పరోక్షంగా మాట్లాడారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రభుత్వంలో కాపులకు ఎప్పుడూ తక్కువ ప్రాతినిధ్యం లేదు. కానీ,రాజకీయ అధికారానికి దగ్గరగా ఉన్నప్పటికీ వారు ఎప్పుడూ రెండవ స్థానంలోనే ఉన్నారు, ముఖ్యమంత్రులు కాలేకపోయారు. కాపులు తమ సముచిత స్థానాన్ని పొందాలనేది పవన్ కళ్యాణ్ ప్రసంగంలోని సారాంశం.
మరో కాపు నేత గంటా శ్రీనివాసరావు కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వారే ముఖ్యమంత్రి కాబోతున్నారని అన్నారు. పాయకరావుపేటలో వంగవీటి రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇకపై కాపులు అధికారం చేపడతారని అన్నారు.ఈ కాపుల సమావేశం పవన్ కళ్యాణ్ పై ప్రభావం చూపిందని అంటున్నారు.
మొత్తం ఓట్లలో 18 శాతం ఉన్న కాపులు ఏపీలోని 80 సీట్లపై కీలక ప్రభావం చూపుతుందని అంటున్నారుచూపుతున్నారు. అయితే అవి కాంగ్రెస్, వైసిపి,టీడీపీల మధ్య చీలిపోయాయి. కాపులను ఒకే తాటిపైకి తీసుకురావాలని ప్రజారాజ్యం,జనసేన పార్టీలు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కాపులు ఈసారి ఏకతాటిపైకి వచ్చి కొత్త చరిత్రను లిఖిస్తారా? వేచి చూద్దాం.