NBK107 సినిమాకు తిరుమల శ్రీవారి ఆశీస్సులు

‘అఖండ’ విజయంతో సూపర్ డూపర్ సక్సెస్ అందుకున్న యువరత్న నందమూరి బాలకృష్ణ.. అదే జోష్‌లో వరుస సినిమాలు చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ రేంజ్‌లో మరో మాస్ జాతరకు రెడీ అయ్యారు. బాలకృష్ణ- గోపీచంద్ మలినేని మాస్ కలయికలో రాబోతున్న ఈ సినిమాలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ షేడ్స్‌లో మరో మాస్ జాతర. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రలో కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తుండగా.. మరో లేడీ పవర్ ‌ఫుల్ పాత్రను వరలక్ష్మీ శరత్ కుమార్‌ పోషిస్తోంది. నిజ జీవిత సంఘటనలతో మాస్ ఆడియన్స్‌కి పిచ్చెక్కిపోయే సన్నివేశాలతో ఈ సినిమా రూపొందుతోందని టాక్.

రాయలసీమ నేపథ్యంలో ఈ సినిమా కథ ఉండబోతోందని, ఇందులో బాలయ్య బాబు రెండు డిఫరెంట్ వేరియేషన్స్‌లో కనిపించబోతున్నారని అంటున్నారు. బాలయ్య చేస్తున్న డ్యూయల్ రోల్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తుందని, రెండు కూడా మాస్ క్యారెక్టర్స్ అనే టాక్ వినిపిస్తోంది. కాగా, NBK 107 అంటూ సినిమా పేరు ప్రకటించకుండా ఇటీవలే ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలారు మేకర్స్. ఇందులో బాలకృష్ణ పవర్‌ఫుల్ లుక్ నందమూరి అభిమానులకు కిక్కిచ్చింది.

తిరుమల శ్రీవారి ఆశీస్సులు తీసుకొని నందమూరి బాలకృష్ణతో రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్‌ను స్వామి సన్నిధిలో ప్రారంభిస్తున్నామని, ఈ చిత్రం ఘన విజయం సాధించడం ఖాయమని దర్శకుడు గోపీచంద్, రచయిత రామజోగయ్య శాస్త్రి తెలిపారు.

బాలకృష్ణ- గోపీచంద్ మలినేని మాస్ కలయిక కావడంతో ఈ మూవీపై ఓ రేంజ్ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు బాలయ్యది డ్యూయల్ రోల్ అని తెలుస్తుండటం మరింత ఆసక్తికరంగా మారింది.

Previous articleఏపీలో పెగాసస్ ప్రకంపనలు వెనుక ఉన్నదెవరు ?
Next articleసూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని