నాని హీరోగా  `అంటే సుందరానికి` చిత్రంలో `జీరోత్ లుక్`

ప్రతిష్టాత్మక మైత్రీ మూవీ బ్యానర్‌పై వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటించిన రామ్-కామ్ ఎంటర్‌టైనర్ `అంటే సుందరానికి` జూన్ 10న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

నాని సరసన నజ్రియా ఫహద్‌ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో లీలా థామస్‌గా నజ్రియాను పరిచయం చేస్తూ, మేకర్స్ ఆమెకు చెందిన‌ జీరోత్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఆ లుక్ ఎలా వుందంటే, ఒక‌ చేత్తో ఆమె తన కలల సముద్రంలో ప్రయాణించే ఫోటోగ్రాఫర్‌గా క‌నిపిస్తూ, మ‌రోవైపు దీర్ఘాలోచనలలో వుంది. చేతిలో కెమెరా పట్టుకుని ట్రెండీ దుస్తుల్లో కనిపిస్తుంది. ఈ లుక్‌తో పోస్టర్‌లో అందంగా ఉంది.

ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించగా, నికేత్ బొమ్మి కెమెరా నిర్వ‌హిస్తున్నారు. రవితేజ గిరిజాల ఎడిటర్.

తారాగణం: నాని, నజ్రియా ఫహద్, నదియా, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ తదితరులు.

Previous articleSaiee Manjrekar
Next articleప్రైవేట్ సంస్థలకు ఏపీలో ఆన్‌లైన్ సినిమా టికెట్ల టెండర్లు?