తెలంగాణ కాంగ్రెస్‌లో పంజాబ్ పరిస్థితి పునరావృతం కానుందా ?

ఎన్నికల పరాజయాల నుంచి కాంగ్రెస్ పార్టీ గుణపాఠాలు నేర్చుకోదని చాలాసార్లు రుజువైంది. తెలంగాణాలో మరోసారి రిపీట్ అవుతోంది. తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడున్న పరిస్థితి పంజాబ్‌లో అంతర్గత విభేదాల కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీని గుర్తు చేస్తోంది.
పంజాబ్‌ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ నిరంతర తిరుగుబాటు కారణంగా ఎన్నికలకు కొన్ని నెలల ముందు మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ పదవి నుండి తప్పించి వలసి వచ్చింది.తదనంతరం, అమరీందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీని వీడి సొంత పార్టీని ఏర్పాటు చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత కూడా పంజాబ్‌ కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలతో చివరకు ఆమ్ ఆద్మీ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది.
తెలంగాణలో కూడా అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. బలమైన తెలంగాణ రాష్ట్ర సమితిని ఎదుర్కొనేందుకు పార్టీని పునర్నిర్మించేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కొందరు కాంగ్రెస్ నేతలు ప్రకటనలు చేయని రోజు లేదు. సోమవారం మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి నివాసంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ఓ వర్గం సమావేశం నిర్వహించి రేవంత్‌ రెడ్డి ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించారు.
2023లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ కార్యక్రమాల నిర్వహణలో కీలక నిర్ణయాలు తీసుకోవడంలో సీనియర్లను కలుపుకు వెళ్లడం లేదని పేర్కొంటూ రేవంత్ రెడ్డిపై పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి ప్రతినిధి బృందాన్ని తీసుకెళ్లాలన్నారు.కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి 119 అసెంబ్లీ నియోజకవర్గాలు, 33 జిల్లాల్లో పర్యటిస్తానని రేవంత్ ప్రకటించడంపై సీనియర్లు అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తమతో సంప్రదింపులు జరపకుండా పీసీసీ చీఫ్‌ ఇంతటి కీలక నిర్ణయం ఎలా తీసుకుంటారని ఆశ్చర్యపోతున్నారు. ఈ సమావేశంలో వి హనుమంతరావు, జె గీతారెడ్డి, శ్యామ్ మోహన్, జి నిరంజన్, పొన్నాల లక్ష్మయ్య, డి శ్రీధర్ బాబు, టి జయప్రకాష్ రెడ్డి, ఎం కోదండ రెడ్డి, కమలాకర్ రావు పాల్గొన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని ధీమా వ్యక్తం చేస్తూనే, ఇదంతా జరగాలంటే జట్టుగా పని చేయాలని భావించారు.సీనియర్లను పట్టించుకోకుండా రేవంత్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే టీఆర్‌ఎస్‌ను ఓడించడం, బీజేపీ ఎదుగుదలను కాంగ్రెస్ ఆపలేమని సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి వివరించాలని సీనియర్లు నిర్ణయించారు

Previous articleStand Up Rahul Movie Pre-Release Event
Next articleజగన్ కోర్టులో కాపు రిజర్వేషన్ల అంశం?