‘గాలివాన’ వెబ్‌ సిరీస్‌ 

ఎప్పటికప్పుడు  వీక్షకులకు ఏదో ఒక కొత్తదనం అందించాలనే సంకల్పంతో అన్ని తరహాల సినిమాలు, ఒరిజినల్‌  వెబ్‌ సిరీస్‌లతో వీక్షకుల మనసులు దోచుకుంటోంది Zee5. ప్రతి నెలా  Zee5  బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బస్టర్ రిలీజ్‌లతో తెలుగు OTT ల్యాండ్‌స్కేప్‌లో బెంచ్‌మార్క్ సెట్ చేస్తోంది, ముఖ్యంగా ఒరిజినల్  సినిమాల  విడుదల వెనుక వారి వ్యూహం విశేషమైనది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుండి కామెడీ డ్రామా ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ నుండి లూజర్ మరియు సంకెల్లు (తమిళంలోని విళంగు సిరీస్ నుండి డబ్బింగ్ సిరీస్) వంటి టాప్ నాచ్ సిరీస్ తర్వాత  బిబిసి స్టూడియోస్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ భాగస్వామ్యంతో బిబిసి స్టూడియోస్‌ నిర్మించిన యురోపియన్‌ డ్రామాను తెలుగు ప్రేక్షకుల అభిరుచుల మేరకు మార్పులు చేసి ‘గాలివాన’ అనే ఒరిజినల్‌ సిరీస్‌గా నిర్మిస్తోంది. ఇందులో  రాధికా శరత్‌ కుమార్‌, డైలాగ్ కింగ్  సాయి కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా చాందిని చౌదరి, చైతన్య కృష్ణ, శరణ్య ప్రదీప్, అశ్రిత, అర్మాన్ మరియు నందిని రాయ్,  తాగుబోతు రమేష్‌, కీలక పాత్రలు పోషిస్తున్న టైటిల్ మరియు పాత్రలను వెల్లడించే మోషన్ పోస్టర్‌ను Zee 5 ఈరోజు విడుదల చేసింది. మోషన్ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.అయితే ఈ వెబ్ సిరీస్ కథ ఏంటి ? రిలీజ్ ఎప్పుడు చేస్తారు అనేది Zee5 త్వరలోనే తెలియజేస్తుంది.

నటీనటులు :సాయికుమార్‌, రాధిక శరత్‌కుమార్‌, నందిని రాయ్‌, చాందిని చౌదరి, చైతన్య కృష్ణ, అశ్రిత వేముగంటి, తాగుబోతు రమేష్‌, అర్మాన్‌, శరణ్య ప్రదీప్‌, ఆర్‌. రమేష్‌, శ్రీలక్ష్మి, నిఖిత, చరిత్‌, సతీష్‌ సారిపల్లి, నానాజీ, నవీన్‌, సూర్య శ్రీనివాస్‌, జయచంద్ర తదితరులు.

Previous articleచరిత్రను మార్చి రాస్తా.. ఆకట్టుకుంటున్న “బిచ్చగాడు 2”
Next articleఅభిమానంతో సుకుమార రూపం