‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ కోసం టికెట్ ధర అదనంగా రూ. 100 రూపాయలు

దర్శకధీరుడు రాజమౌళి క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ మరో పదిరోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ సినిమా గురించి దేశం మొత్తం ఆసక్తిని కనబరుస్తోంది. యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి తొలిసారిగా స్ర్కీన్ షేర్ చేసుకోనున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఉన్నారు. ప్రస్తుతం జక్కన్న అండ్ టీమ్ సినిమా ప్రమోషన్స్ ను జోరుగా చేస్తోంది. నిన్న (సోమవారం) ఈ సినిమా నుంచి ‘ఎత్తర జెండా’ అనే సెలబ్రేషన్ సాంగ్ విడుదల చేసిన మేకర్స్.. త్వరలోనే ప్రీరిలీజ్ ఈవెంట్ ను దుబాయ్ వేదికగా గ్రాండ్ గా చేయబోతున్నట్టు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాకి టికెట్ ధర పెంపుదల విషయమై ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను రాజమౌళి, నిర్మాత డివీవీ దానయ్య కలిసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో జగన్ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.  తాజా సమాచారం ప్రకారం ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ కోసం టికెట్ ధరను రూ. 100 రూపాయలు అదనంగా పెంచారట. దీంతో ఈ సినిమాకి బిగ్ రిలీఫ్ దొరికినట్టే. జగన్ ఇంత పాజిటివ్ గా స్పందించి టికెట్ ధరను పెంచడంతో రాజమౌళి చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మాణం జరుపుకున్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి భారీగా రిటర్న్స్ రావాలంటే టికెట్ ధర చాలా కీలకమని తెలిసిందే. అలాగే.. ఈ సినిమాకి ఏపీలో ఐదవ షోకి కూడా అనుమతి లభించడంతో భారీ ఓపెనింగ్స్ రాబట్టే అవకాశాలున్నాయి. దీనిపై అఫీషియల్ ప్రకటన రాబోతోంది. 

Previous articleహీరో ఆనంద్ దేవరకొండ  “గం..గం.. గణేశా” 
Next articleAnjushree