హీరో ఆనంద్ దేవరకొండ ‘బేబీ’

ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా ‘బేబీ’.  ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్ కే ఎన్, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు. విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మంగళవారం ఆనంద్దే వరకొండ పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్ ఎలా ఉందో చూస్తే…వాడిన రోజా పువ్వును హీరో ఆనంద్ దేవరకొండ పట్టుకుని తీక్షణంగా చూస్తున్నారు. రోజ్ ఫ్లవర్ ఇస్తూ ఆమె స్పందన కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఓల్డ్ రోజ్ ఫ్లవర్ వెనక దాగి ఉన్న కథేంటి అనేది సినిమాలో చూడాలి. ఈ పోస్టర్ తో ఆనంద్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు టీమ్ మెంబర్స్.  న్యూ ఏజ్ లవ్ స్టొరీ గా తెరకెక్కుతున్న ‘బేబీ’ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉంది.

Previous articleVarsha Bollamma
Next articleగోవింద ద్వాదశి యొక్క ప్రాముఖ్యత: