చర్మ సోయగానికి..

అందమైన చర్మాన్ని సొంతం చేసుకోవాలన్న కోరిక చాలా మందికి ఉంటుంది. కాకపోతే బ్యూటీ పార్లర్లకు వెళ్లే తీరిక, ఓపిక, సమయం ఉండదు. అలాంటి వారి కోసం సొంతంగా ఇంట్లోనే కొన్ని చిట్కాలతో అందాన్ని సొంతం చేసుకోవచ్చు.. ఎలాగో చూడండి
నిమ్మరసం: ఇది చాలా తేలికైన చిట్కా. టేబుల్ స్పూన్ నిమ్మరసంలో కొన్ని చుక్కల తేనె కలిపి ముఖానికి పట్టించి అరగంట తరువాత ముఖం కడుక్కుంటే మిల మిల మెరుస్తూ ఉంటుంది. ఈ నిమ్మరసంలో కొద్దిగా శనగపిండి, చిటికెడు పసుపు కిలిసి ఈ మిశ్రమాన్ని ముఖంతో పాటు శరీరం మొత్తం పట్టించి ఆరిన తరువాత స్నానం చేస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు.
టమోటా రసం: టమోటా రసాన్ని స్నానానికి ముందు ముఖం అంతా పట్టించి బాగా ఆరనిచ్చి అనంతరం స్నానం చేస్తే మంచిది
ఓట్ మీల్: ఓట్ మీల్, బాదం పప్పులను పొడిచేసి దానిలో పాలు, తేనె కలిపి ఈ మిశ్రమాన్ని ముఖంతో పాటు శరీరమంతా పట్టించి ఆరిన తరువాత స్నానం చేయాలి
పాలు: ముఖం మీద మురికిని తొలిగించడానికి పాలు బాగా పనికొస్తాయి. రాత్రి పడుకోవడానికి ముందు పాలతో ముఖం మీద ఉన్న మురికిని తొలగించి మ్యాచ్చు రైజర్ అప్లయ్ చెయ్యాలి. చర్మ సౌందర్యాన్ని పరిరక్షించడంలో పాలు బాగా ఉపకరిస్తుంది
శాండిల్ ఉడ్: శాండిల్ ఉడ్ పౌడర్లో కొద్దిగా రాజ్ వాటర్ కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి

Previous articleషుగర్ ని శాశ్వతంగా అరికట్టే గింజలు..
Next articleRRR Movie Exclusive NTR