ఏపీలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు పై స్పందించిన బ్రదర్ అనిల్ !

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించాలనే చర్చపై సమాధానాలు ఇవ్వకుండా దాటవేసిన ప్రముఖ క్రైస్తవ మత ప్రచారకుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బావ బ్రదర్ అనిల్ కుమార్ ఎట్టకేలకు అలాంటి ప్రతిపాదన ఉందని అంగీకరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో నేను కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించాలని అన్ని వర్గాల ప్రజల నుండి డిమాండ్ ఉంది. అయితే కొత్త పార్టీ పెట్టడం అంటే చిన్న విషయం కాదు.పార్టీని స్థాపించడం, దానిని నిలబెట్టుకోవడం అంత ఈజీ కాదు అని సోమవారం విశాఖపట్నంలోని ఓ హోటల్‌లో రాష్ట్రంలోని వివిధ క్రైస్తవ, ఓబీసీ సంఘాల ప్రతినిధులతో సమావేశమైన అనంతరం అనిల్ కుమార్ మీడియాతో అన్నారు. అయితే జగన్ ప్రభుత్వం క్రిస్టియన్లు, ఓబీసీలు, ఎస్సీ,ఎస్టీలకు న్యాయం చేయకుంటే తాను కచ్చితంగా తీవ్ర నిర్ణయం తీసుకుంటానన్నారు. వారి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. అది నా బాధ్యత. వారి ఫిర్యాదులను ప్రభుత్వం పరిష్కరించకపోతే, నేను తీవ్రమైన నిర్ణయం తీసుకుంటాను అని ఆయన అన్నారు.
క్రైస్తవులు, బీసీల సంక్షేమం గురించి జగన్ పట్టించుకోవడం లేదని జగన్ సోదరి వైఎస్ షర్మిల భర్త అనిల్ కుమార్ ఆరోపించారు.“2019 ఎన్నికలకు ముందు, నేను ఈ సంఘాలతో సమావేశం నిర్వహించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వారి మద్దతును అభ్యర్థించాను. ఇప్పుడు వారు నిర్లక్ష్యానికి గురవుతున్నారు అని అన్నారు.
వారికి అండగా నిలవడం తన బాధ్యత అని, వారి సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని అనిల్ కుమార్ తెలిపారు. నేను జగన్‌ను నేరుగా కలవాల్సిన అవసరం లేదు.నిజానికి ఆయన్ను కలుసుకుని రెండున్నరేళ్లకు పైగా అయ్యింది అని అన్నారు.
చివరి నిమిషంలో పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన లాబీయిస్టులు, బయటి వ్యక్తులు మాత్రమే వైఎస్సార్‌సీపీలో ఆధిపత్యం చెలాయిస్తున్నారని, నిజంగా పార్టీ కోసం కష్టపడిన వారికి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.వారికి న్యాయం జరిగేలా పోరాటం చేస్తానని ఆయన అన్నారు.

Previous articleLatest Photos YUKTI THAREJA
Next articleసుమ కనకాల ప్ర‌ధాన పాత్ర‌లో `జయమ్మ పంచాయతీ`